Home గాసిప్స్ రీమేక్ లు వద్దూ అంటుంటే మరో బిగ్ రీమేక్ కోసం పోటి పడుతున్నారు!

రీమేక్ లు వద్దూ అంటుంటే మరో బిగ్ రీమేక్ కోసం పోటి పడుతున్నారు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో రీసెంట్ టైంలో రీమేక్ సినిమాలు అంటే మాత్రం ఆడియన్స్ అసలు ఆ సినిమాను చూడటానికి ఏమాత్రం ఆసక్తిని చూపించడం లేదు అన్న విషయం అందరికీ క్లారిటీ వచ్చింది…. రీసెంట్ టైంలో టాలీవుడ్ లో వచ్చిన బ్రో, భోలా శంకర్ ఇలా…

చాలా సినిమాల రీమేక్ లు ఆడియన్స్ ను అలరించడంలో విఫలం అయ్యాయి. ఇలాంటి టైంలో భోలా శంకర్ రిజల్ట్ ఆల్ మోస్ట్ అందరికీ ఆడియన్స్ రీమేక్ సినిమాలు అంటే ఏమాత్రం థియేటర్స్ కి రావడానికి సిద్ధంగా లేరని క్లారిటీ వచ్చేయగా…

అప్ కమింగ్ రీమేక్ ల విషయంలో కూడా వెనకడుగు వేసి రీమేక్ లను కాన్సిల్ చేస్తున్నారు…ఇక ఇలాంటి టైం లో మళ్ళీ ఎందుకో తిరిగి ఒక రీమేక్ కోసం కొందరు నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో…

వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న టైంలో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ ను తీసుకుని ఒకప్పుడు భారీ హిట్ గా నిలిచిన సినిమాకి సీక్వెల్ గా రూపొందించిన అక్షయ్ కుమార్(akshay kumar) నటించిన OMG2 సినిమా ను ఇప్పుడు టాలీవుడ్ లో…

రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి డెలికేట్ లైన్ తెలుగు లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అదే టైంలో OMG సినిమా తెలుగులో గోపాల గోపాల పేరుతో రీమేక్ అయ్యి యావరేజ్ గా నిలిచింది. ఒకవేళ రీమేక్ ని ఓకే చేసినా ఇక్కడ ఎవరు నటిస్తారో అన్నది అనుమానమే…. త్వరలోనే మరిన్ని విషయాలు ఈ రీమేక్ గురించి తెలిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here