బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 38 రోజులు పూర్తీ అయ్యే టైం కి 175 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్న అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప, రిలీజ్ రోజు టాక్ కి ఈ రేంజ్ రన్ అనేది అస్సలు ఎవ్వరూ కూడా ఎక్స్ పెర్ట్ కూడా చేయలేదు అనే చెప్పాలి. పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ క్రేజ్ ని….
సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో రన్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది కానీ హిందీ లో ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెడుతూ దూసుకు పోతున్న పుష్ప సినిమా రీసెంట్ గా 6 వ వీకెండ్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం…
చేసుకుని దుమ్ము లేపింది, శుక్రవారం 60 లక్షలు, శనివారం 85 లక్షలు, ఆదివారం ఏకంగా 1.4 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సోమవారం ఆల్ మోస్ట్ 65 లక్షల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఇప్పుడు ఏకంగా 95 కోట్ల మార్క్ ని అందుకుంది…
అక్కడ ఒకసారి వారం వారం సినిమా సాధించిన నెట్ కలెక్షన్స్ ని గమనిస్తే….
WEEK 1:- 26.89CR
WEEK 2:- 20.20CR
WEEK 3:- 25.40CR
WEEK 4:- 11.79CR
WEEK 5:- 7.30CR
WEEK 6:- 3.50CR(4 days)
Total – 95.08CR(116.85Cr Gross – 44.35CR Share)
ఇదీ సినిమా ఇప్పటి వరకు హిందీ లో సొంతం చేసుకున్న కలెక్షన్స్ లెక్క… 39 రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పుష్ప సినిమా…
సోమవారం కూడా బాగా హోల్డ్ చేయగా మరి కొన్ని వారాల పాటు కూడా హిందీలో అసలు రిలీజ్ కి ఏ సినిమాలు లేక పోవడంతో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ గా మారగా లాంగ్ రన్ ఇంకా ఉంటే 100 కోట్ల మార్క్ ని అందుకుని చరిత్ర తిరగరాసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా అంత దూరం వెళుతుందా లేక పరుగును 100 లోపే ముగిస్తుందా చూడాలి ఇక…