Home న్యూస్ ఊరుపేరు భైరవకోన స్పెషల్ షోల కలెక్షన్స్…మాస్ కుమ్ముడు ఇది!

ఊరుపేరు భైరవకోన స్పెషల్ షోల కలెక్షన్స్…మాస్ కుమ్ముడు ఇది!

0

చాలా టైం గా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో సందీప్ కిషన్(Sundeep Kishan) ఒకరు….తన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) ఆడియన్స్ ముందుకు శుక్రవారం రిలీజ్ కానుండగా సినిమా మీద నమ్మకంతో వాలెంటైన్స్ డే రోజున సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ తో రిలీజ్ చేశారు….

సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ సొంతం అవ్వగా ప్రీమియర్స్ కి వాలెంటైన్స్ డే రోజున సాలిడ్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి అని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమాకి సెలెక్టివ్ ఏరియాలలో స్పెషల్ షోలు పడగా ప్రీమియర్స్ కి సినిమా కి ఓవరాల్ గా కోటి రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ గ్రాస్ రూపంలో సొంతం అయ్యాయి…

ఓవరాల్ గా లిమిటెడ్ ప్రీమియర్స్ తో కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ సొంతం అవ్వడం విశేషం కాగా సినిమాకి ఇక శుక్రవారం ఉన్నంతలో భారీ రిలీజ్ సొంతం అవుతూ ఉండటంతో కామన్ ఆడియన్స్ నుండి టాక్ బాగుంటే మంచి ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

ఇక సినిమా ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 800 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, మరి చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుని హిట్ అందుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here