Home న్యూస్ ఆపరేషన్ వాలెంటైన్ థియేటర్స్….బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు!!

ఆపరేషన్ వాలెంటైన్ థియేటర్స్….బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు!!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) ఆడియన్స్ ముందుకు మార్చ్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, తెలుగు లో ఈ సినిమా జానర్ మూవీస్ ఇప్పటి వరకు పెద్దగా రాక పోవడంతో ఈ సినిమాను ఆడియన్స్ ఇప్పుడు…

ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా 17 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకుని 18 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 600 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా….

రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇక ఓవర్సీస్ లో 220 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 900 నుండి 950 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యి 3 రోజులు అవుతూ ఉండగా ఓవరాల్ గా…

సినిమాకి మల్టీ ప్లెక్సులలో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ఉండగా సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం బుకింగ్స్ చాలా నీరసంగానే ఉన్నాయి అని చెప్పాలి. దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని సినిమా రిలీజ్ కాబోతూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ జరిగాయి…

వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి 1 కోటి రేంజ్ నుండి 1.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. మరి సినిమా ఈ అంచనాల ప్రకారమే ఓపెన్ అవుతుందా లేక ఇంతకుమించి జోరు చూపిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here