Home న్యూస్ ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్…..మాస్ రచ్చ లేపిన రామ్ చరణ్!!

ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్…..మాస్ రచ్చ లేపిన రామ్ చరణ్!!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా రీ రిలీజ్ అవ్వగా సినిమా అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 25న లిమిటెడ్ స్పెషల్ షోలతో రిలీజ్ అవ్వగా ఆ రోజు సినిమా 17 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

26 న ఫుల్ గా అన్ని చోట్లా సినిమా స్పెషల్ షోలు పడగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో 1.42 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సొంతం చేసుకుంది.

   

ఇక రామ్ చరణ్ పుట్టిన రోజున కూడా సినిమా ఎక్స్ లెంట్ గానే హోల్డ్ చేసి మరో 63 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇలా ఉంది..
👉Nizam – 1.17Cr
👉Ceeded – 18L~
👉Andhra – 70L~
👉AP-TG Total Collections – 2.05CR~ GROSS
👉KA+ROI – 13L
Total WW Collections – 2.18CR GROSS~

మొత్తం మీద రీ రిలీజ్ మూవీ కి ఇవి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి. అందునా డిసాస్టర్ అయిన ఆరెంజ్ లాంటి సినిమా ఐప్పుడు ఇలాంటి కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం. ఇక సినిమా 3వ రోజు కూడా వర్కింగ్ డే లో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here