Home న్యూస్ ‘బలగం’ చూపించలేక పోతున్న రంగమార్తాండ!

‘బలగం’ చూపించలేక పోతున్న రంగమార్తాండ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు అన్నీ బలగంలా విజయాన్ని నమోదు చేయలేవు అని మరోసారి రుజువు అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే విజయాన్ని నమోదు చేసుకుని ఇప్పుడు డిజిటల్ లో కూడా రిలీజ్ అయినా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధిస్తుంది. బలగం కన్నా కూడా ఎక్కువ రివ్యూలు రేటింగ్ లను సొంతం చేసుకున్న…

Balagam 24 Days Collections Report!!

రంగమార్తాండ కూడా బలగంలా పాజిటివ్ టాక్ పవర్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నా కానీ అలాంటిదేమీ జరగడం లేదు… 5 రోజుల్లో 1.65 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా 6వ రోజు కేవలం 10 లక్షల రేంజ్ లోనే షేర్ ని సాధించి నిరాశ పరిచింది.

దాంతో అందరూ బలగం కన్నా బెటర్ రేటింగ్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బలగంగా హోల్డ్ చేయలేక పోయింది… బలగం సినిమా కాన్సెప్ట్ కొంచం డిఫెరెంట్ గా ఉండటం తెలంగాణా నేటివిటీ, పాటలు అండ్ లైట్ కామెడీ వర్కౌట్ అవ్వడం కలిసి వచ్చింది…

Balagam 23 Days Collections Report!!

కానీ రంగమార్తాండ కంప్లీట్ గా సీరియస్ సబ్జెక్ట్ అవ్వడం మైనస్ అయిందని చెప్పాలి. అయినా కూడా పాజిటివ్ టాక్ ఉండటంతో బలగం రేంజ్ లో కాకున్నా అందులో సగమైన హోల్డ్ చేస్తుంది అనుకుంటే మట్టుకు హిట్ గీతని అందుకోవడానికి ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here