బాక్స్ ఆఫీస్ దగ్గర 2010 టైంలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన రామ్ చరణ్(Ram Charan) నటించిన ఆరెంజ్(Orange Movie) సాంగ్స్ వలన సూపర్ పాపులర్ అవ్వగా, తర్వాత టైంలో సాలిడ్ ఫాలోయింగ్ నే సొంతం చేసుకుంది. రెండేళ్ళ క్రితం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్..
సాలిడ్ గా ఉన్న టైంలో ఈ సినిమా ను రీ రిలీజ్ చేయగా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వచ్చింది..రీ రిలీజ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని ఆ టైంలో సొంతం చేసుకుంటూ 3.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది… ఇక రెండేళ్ళ తర్వాత ఇప్పుడు సినిమాను…
మళ్ళీ రీ రిలీజ్ చేశారు….ఈ వాలెంటైన్స్ వీకెండ్ లో థియేటర్స్ లో ఇతర సినిమాలు కూడా ఉన్నప్పటికీ లిమిటెడ్ షోలతో మొదలైన ఆరెంజ్ మూవీ ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వస్తూ ఉండటంతో షోల లెక్క అలా అలా పెరిగిపోతూ దుమ్ము దుమారం లేపింది…
రిలీజ్ కి ముందు రోజు వరకు ఓవరాల్ గా 32 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను ఆన్ లైన్ లో సొంతం చేసుకుని ఈ వీక్ తెలుగు లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల కన్నా బెటర్ గా జోరు చూపిస్తూ ఉండటం విశేషం. ఇక రిలీజ్ అయిన తర్వాత సినిమా కి ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ రిపోర్ట్ అవుతూ ఉండగా….
చాలా చోట్ల సినిమా కి హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడటం విశేషం అని చెప్పాలి. డిసాస్టర్ మూవీ రీ రిలీజ్ లో కుమ్మేయడం ఒకెత్తు అయితే ఇప్పుడు రీ రీ రిలీజ్ లో కూడా ఇలా ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేస్తూ ఉండటం మరో ఎత్తు అని చెప్పాలి. ఇక రీ రీ రిలీజ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.