Home న్యూస్ నారప్ప రికార్డ్ బ్రేక్ చేసిన టక్ జగదీష్…టాలీవుడ్ నంబర్1

నారప్ప రికార్డ్ బ్రేక్ చేసిన టక్ జగదీష్…టాలీవుడ్ నంబర్1

0

అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ రేసులో భారీ లెవల్ లో రిలీజ్ అవ్వాల్సిన నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ సినిమా పరిస్థితుల వలన పోస్ట్ పోన్ అవ్వాల్సి రాగా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ అండ్ ఆంధ్రలో టికెట్ రేట్ల పరిస్థితి వలన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టైం అవ్వడం తో ఇక చేసేదేమీ లేక పోవడం తో సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్…

ఇక ఈ సినిమా 10 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న టైం లో సినిమా ఓవరాల్ గా డైరెక్ట్ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో జరిగింది అన్నది ఆసక్తిగా మారగా సినిమాను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కొన్న డీల్ గురించిన న్యూస్ ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది…

ఆ వార్తల ప్రకారం సినిమా ఓవరాల్ బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇది వరకు హైయెస్ట్ డిజిటల్ రిలీజ్ రేటుని సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ నారప్ప రికార్డును బ్రేక్ చేసిందని అంటున్నారు. నారప్ప సినిమా కి ఓవరాల్ గా 40 కోట్ల డైరెక్ట్ రిలీజ్ రేటు ఆఫర్ కన్ఫాం అవ్వగా…

ఇప్పుడు నాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా కి మొత్తం మీద 41 కోట్ల రేటు తో డీల్ ని క్లోజ్ చేశారని తెలుస్తుంది… అందులో ఓ చిన్న కిటుకు కూడా ఉందని అంటున్నారు. టక్ జగదీష్ పెద్ద సినిమా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో OTT మాత్రమె ఎక్కువ రేటు ఇవ్వగలదు కాబట్టి మారిన పరిస్థితుల వలన అమెజాన్ ప్రైమ్ 37 కోట్ల రేటుకి ఫిక్స్ చేశారట…

కానీ మేకర్స్ నేగోషియేట్ చేయడం తో మొదటి వారం తర్వాత సినిమా కి వ్యూస్ ని బట్టి 4 కోట్లు తర్వాత ఇస్తారని అంటున్నారు. ఓవరాల్ గా వ్యూస్ సాలిడ్ గానే వచ్చే అవకాశం ఉండటం తో మొత్తం మీద 41 కోట్ల రేటు తో సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హైయెస్ట్ డిజిటల్ రిలీజ్ రేటు ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here