Home న్యూస్ ఓరి దేవుడా మూవీ రివ్యూ….!!!

ఓరి దేవుడా మూవీ రివ్యూ….!!!

0

విశ్వక్ సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించిన లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా ఆడియన్స్ ముందుకు దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడం, సాంగ్స్ కూడా మంచి రీచ్ ని సొంతం చేసుకోవడంతో సినిమా పై పర్వాలేదు అనిపించేలా అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…

చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిన హీరో హీరోయిన్స్ తర్వాత పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటారు, కానీ ఏడాదికే విడిపోవాలి అనుకుంటారు, అలాంటి టైం లో దేవుడు అయిన వెంకటేష్ హీరోకి సెకెండ్ ఛాన్స్ ఇస్తాడు, తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా విశ్వక్ సేన్ తన రోల్ ని చాలా బాగా చేయగా హీరోయిన్స్ కూడా బాగా ఆకట్టుకున్నారు. స్పెషల్ రోల్ లో వెంకటేష్ కూడా మెప్పించగా మిగిలిన యాక్టర్స్ కూడా ఆకట్టుకున్నారు…

కథ కొంచం టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టగా కొన్ని సీన్స్ బాగానే ఆకట్టుకోగా ఇంటర్వెల్ ఎపిసోడ్ మెప్పించడంతో ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా ఆ అంచనాలను చాలా వరకు అందుకుంటూ సెకెండ్ ఆఫ్ ఉంటుంది, క్లైమాక్స్ కూడా బాగా మెప్పించి ఓవరాల్ గా సినిమా బాగానే ఇంప్రెస్ చేస్తుంది…

పాటలు బాగుండటం, ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించడం, సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉండటం, వెంకటేష్ రోల్ బాగా వర్కౌట్ అవ్వడం లాంటివి సినిమా కి ప్లస్ పాయింట్స్ అయితే కథ టేక్ ఆఫ్ కి టైం పట్టడం, అక్కడక్కడా కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించడం లాంటివి డ్రా బ్యాక్స్…. అయినా కానీ డైరెక్టర్ ఒరిజినల్ ఓ మై కడవులే సినిమాను ఏమాత్రం చెడగొట్టకుండా చాలా వరకు బాగా డీల్ చేసి మెప్పించడంతో….

మరీ అద్బుతం కాదు ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా మెప్పిస్తుంది ఓరి దేవుడా సినిమా… ఒరిజినల్ చూడని వాళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చే అవకాశం ఉన్న ఈ సినిమా ఒరిజినల్ చూసిన వాళ్ళకి పర్వాలేదు అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్… ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉన్న సినిమా ఓరి దేవుడా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here