యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ పాగల్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఈ సమ్మర్ టైం లోనే రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా ఆడియన్స్ ముందుకు రాకుండా పోస్ట్ పోన్ అవ్వగా సినిమా ఇప్పుడు సడెన్ గా ఇండిపెండెంట్స్ డే వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దం అయ్యి వారం ముందే అనౌన్స్ మెంట్ తో…
వరుస పెట్టి ప్రమోషన్స్ ను ముగించుకుని ఇప్పుడు రిలీజ్ కాబోతుంది… ఈ సినిమా సమ్మర్ కి అనుకున్నప్పుడు ఓవరాల్ గా నైజాం లో 4 కోట్ల బిజినెస్ ను, సీడెడ్ లో 1.5 కోట్ల బిజినెస్ ను ఆంద్ర రీజన్ లో 3.2 కోట్ల బిజినెస్ ను మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో…
8.7 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు సడెన్ రిలీజ్ అవుతూ ఉండటం తో ఈ బిజినెస్ ను తగ్గించి రిలీజ్ చేస్తున్నారని సమాచారం. కానీ ఎంతవరకు తగ్గించారు అన్నది ఇంకా క్లియర్ ఇన్ఫో రాలేదు. ఇక సినిమా నైజాం లో మొత్తం మీద 220 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా…
ఆంధ్ర మొత్తం మీద 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 570 థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా జరుగుతూ ఉండగా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండటం ఖాయమని చెప్పాలి.
ప్రస్తుతం ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం బిజినెస్ రేంజ్ 6 నుండి 6.5 కోట్ల రేంజ్ లో ఇప్పుడు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ లెక్కన బ్రేక్ ఈవెన్ కి 7 కోట్ల లోపు కలెక్షన్స్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది, ఇక అఫీషియల్ లెక్కలు వచ్చిన తర్వాత సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ లో అప్ డేట్ చేసి తెలియజేస్తాం…