యంగ్ హీరో విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ హిట్ ది ఫస్ట్ కేస్ తర్వాత చేసిన సినిమా పాగల్, ఈ ఇయర్ సమ్మర్ కే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన పోస్ట్ పోన్ అవ్వగా డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పి రీసెంట్ ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే రావాలని వారం ముందు డిసైడ్ అయ్యి ప్రమోషన్స్ జరిపి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే… తన తల్లి తనని ఎంతలా ప్రేమించిందో అలాంటి ప్రేమని తన ప్రేయసి నుండి కూడా కోరుకునే హీరో అలాంటి ప్రేమ కోసం 1600 మందిని లవ్ చేస్తారు. కానీ ఎవ్వరూ దొరకరు. అలాంటి టైం లో హీరోకి నివేత పెతురాజ్ కనిపిస్తుంది.. మరి వీళ్ళ ప్రేమ ఏమయింది అన్నది సినిమా కథ.
కథ చెప్పాలి అంటే చాలా చిన్న లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా కి 2 గంటల 15 నిమిషాల లెంత్ ఎక్కువ లెంత్ లా అనిపించింది. విశ్వక్ సేన్ తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడు. ఎంటర్ టైన్ మెంట్ అందించడం విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు.
ఎమోషనల్ సీన్స్ లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఇక హీరోయిన్స్ లో నివేత కి బెస్ట్ రోల్ దక్కగా తన పాత్రను బాగా తెరకెక్కించారు. మిగిలిన నటీనటులు పర్వాలేదు, కామెడీ సీన్స్ అక్కడక్కడా మెప్పించాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉండగా సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.
సినిమాటోగ్రఫీ మెప్పించాగా డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి, సింగిల్ లైన్ డైలాగ్స్ కొన్ని చోట్ల బాగా పేలాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కొత్త దర్శకుడు నరేష్ కుప్పిలి, ఆరెంజ్ కాన్సెప్ట్ ను మరో విధంగా రాసుకుని ఈ కథని సిద్ధం చేసుకున్నాడు అనిపించింది.
ఫస్టాఫ్ వరకు అక్కడక్కడా కొన్ని సీన్స్ ఎంటర్ టైన్ చేసినప్పటికీ ఒక స్టేజ్ దాటాక కొంచం బోర్ ఫీల్ అవుతాం, కానీ ఓవరాల్ గా ఫస్టాఫ్ బాగానే మెప్పించగా సెకెండ్ ఆఫ్ ఇంకా బెటర్ గా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ సెకెండ్ ఆఫ్ స్లో నరేషన్ తో సెంటిమెంట్ సీన్స్ తో నిండిపోయింది.
దాంతో ఫస్టాఫ్ లో ఉన్న ఎంటర్ టైన్ మెంట్ సెకెండ్ ఆఫ్ లో మిస్ అవ్వడం తో కథ డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది… దాంతో పాటు కథ అప్పటికే ఆడియన్స్ అంచనాలను తగ్గట్లు సీన్ బై సీన్ చెప్పే విధంగా ఉండటం తో ఏమాత్రం కొత్తదనం లేకుండానే ఎండ్ కార్డ్ పడుతుంది. మొత్తం మీద హైలెట్స్ విషయానికి వస్తే…
లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్ కామెడీ సీన్స్, సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ సెకెండ్ ఆఫ్ లో డ్రాగ్, సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పడం…మేజర్ డ్రా బ్యాక్ అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే వాళ్ళు జస్ట్ ఓకే అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…