ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో కచ్చితంగా సేఫ్ జోన్ లో నిలవడం ఖాయం అని ఎక్కువ మంది నమ్మిన సినిమా పడిపడిలేచే మనసు.. శర్వానంద్ మరియు సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా మ్యాజిక్ చేస్తుంది అనుకోగా సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోగా ఫైనల్ గా కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ..
సినిమా కథ పాయింట్ ఎన్నో సినిమాల్లో చూసిన లవర్స్ ముందు ప్రేమించుకోవడం, కొన్ని కారణాల వల్ల విడిపోవడం తిరిగి ఎలా ఏకం అయ్యారు అన్న కాన్సెప్ట్.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు రాగా ఈ సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో వచ్చినా బ్యాగ్ డ్రాప్ మాత్రం కోల్కతా ని ఎంచుకున్నారు.
దాంతో కథ లో ఫ్రెష్ నెస్ లేకున్నా మొదటి అర్ధభాగం ఎంటర్ టైన్మెంట్ సీన్స్ తో మంచి లోకేషన్స్ తో అలరించే సంగీతంతో ఆకట్టుకుంటుంది, కానీ సెకెండ్ ఆఫ్ విషయం లో మాత్రం దర్శకుడు హను రాఘవపూడి అనుకున్న లెవల్ లో అలరించ లేకపోయాడు.
దాంతో సినిమా మంచి ఫ్లో తో మొదలు అయ్యి ఎదో ముగిసింది అనిపిస్తుంది అంతే. ఉన్నంతలో శర్వానంద్ మరియు సాయి పల్లవి ఇద్దరు సినిమాను నిలబెట్టే ప్రయత్నం గట్టిగానే చేసినా సెకెండ్ ఆఫ్ వీక్ స్రీన్ ప్లే మరియు డైరెక్షన్ తో సినిమా రూట్ మారిపోయింది.
దాంతో ఈ వీకెండ్ సేఫ్ వెంచర్ అనుకున్న సినిమా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ గా ముగిలిపోయింది. అలా అని పూర్తిగా కొట్టి పారేసా సినిమా కూడా కాదు. మంచి మ్యూజిక్, మంచి లోకేషన్స్, ఆకట్టుకునే ఫస్టాఫ్ సినిమా కి ప్లస్ పాయింట్స్.
బోర్ కొట్టే సెకెండ్ ఆఫ్ ని కొంచం ఓపిక పట్టి చివరి వరకు ఎదురు చూస్తె సినిమా పర్వాలేదు అనిపిస్తుంది..ఫైనల్ గా హను రాఘవపూడి పాత సినిమా లై తో పోల్చితే చాలా బెటర్ అనిపించే సినిమా ఇది…కొంచం ఓపిక పట్టి చూడాలి అంతే..
ఫైనల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…లవ్ స్టొరీలు ఇష్టపడే వారు స్లో మూవీస్ ఇష్టపడే వారు పడిపడిలేచే మనసు ని ఇష్టపడే అవకాశం ఉంది, రొటీన్ మూవీస్ చూసే వారికి ఫస్టాఫ్ చూసి సెకెండ్ ఆఫ్ బయటికి వచ్చేస్తే సరిపోతుంది.