Home న్యూస్ అంతరిక్షం రివ్యూ…దెబ్బ పడింది కానీ!!

అంతరిక్షం రివ్యూ…దెబ్బ పడింది కానీ!!

0

   రెండు వరుస విజయాల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం ప్రేక్షకుల ముందుకు నేడు భారీ గా వచ్చేసింది. కాగా పోటి ఎక్కువ గా ఉండటం తో సోలో రిలీజ్ కి ఉన్నంత అడ్వాంటేజ్ ని ఈ సినిమా సొంతం చేసు కోలేక పోయింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న లక్ష్యాన్ని సినిమా అందు కుందో లేదో తెలుసు కుందాం పదండి. ముందుగా కథ విషయానికి వస్తే…

శాటిలైట్ కోడింగ్ లో ఎక్స్ పెర్ట్ అయిన వరుణ్ తేజ్ అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ ని మధ్యలోనే ఆపాల్సి వస్తుంది. తర్వాత అనుకోకుండా 5 ఏళ్లకి మరో ప్రాజెక్ట్ లో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా లేదా అన్నది అసలు పాయింట్.

స్పేస్ నేపధ్యంలో సినిమా అంటే అందరికీ ఇంటర్ స్టెల్లర్ సినిమా గుర్తుకు వస్తుంది, ఆ సినిమా ఇన్స్పిరేషన్ తో సౌత్ లో ఒకటి రెండు మూవీస్ వచ్చాయి. ఇప్పుడు అంతరిక్షం కూడా అలాంటి సినిమానే అని చెప్పాలి. సినిమా పాయింట్ బాగున్నా ట్రీట్ మెంట్ అంత పకడ్బందీ గా అనిపించదు.

  సినిమా లో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంత సమయం పట్టగా తర్వాత వచ్చే సీన్ యిట్టె చెప్పేయగలగడం ఈ సినిమా కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని చెప్పాలి. దాంతో పాటు సెకెండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే బోర్ కొట్టడం మరో మైనస్ పాయింట్ గా నిలిచింది.

ఈ రెండు తప్పితే సినిమా మొత్తం స్పేస్ చుట్టూ తిరిగుతూ ఆకట్టుకుంటుంది. వరుణ్ తేజ్ తన వరకు బాగా నటించి మెప్పించాడు, హీరోయిన్స్ ఇద్దరు జస్ట్ ఒకే. సంగీతం సినిమా కి పెద్దగా ప్లస్ కాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఓవరాల్ గా సినిమా లో ఆకట్టుకునే సీన్స్ ఉన్నా కానీ ముందే చెప్పినట్లు అవి పెద్దగా కనెక్ట్ కాలేక పోవడం దాంతో పాటు తర్వాత సీన్ ఊహించే విధంగా ఉండటం తో ఆడియన్స్ కి అంత కిక్ ఇవ్వలేదు ఈ సినిమా. కానీ ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంకరేజ్ చేయాల్సి అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

 ఇలాంటి ప్రయోగాన్ని అటెంప్ట్ చేసినందుకు దర్శకుడి కి అలాగే ఒప్పుకున్నందుకు వరుణ్ తేజ్ కి కంగ్రాట్స్ చెప్పాల్సిందే. సెకెండ్ ఆఫ్ బోర్ సీన్స్ ని, స్క్రీన్ ప్లే ప్రిడిక్ట్ చేసే విధంగా చూసుకోకుండా ఉంటె సినిమా మరో రేంజ్ లో ఉండేది, ఓవరాల్ గా సినిమా…

ఒక మంచి అటెంప్ట్ గా చెప్పుకోవచ్చు. ఇంత పోటి లో కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…డిఫెరెంట్ మూవీస్, కొత్త కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారికి అంతరిక్షం మంచి ఆప్షన్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here