బాక్స్ ఆఫీస్ దగ్గర యాక్షన్ హీరో గోపీచంద్ ఖాతాలో రీసెంట్ టైం లో అనుకున్న రేంజ్ లో అయితే హిట్ లేదని చెప్పాలి. లాస్ట్ ఇయర్ సీటిమార్ తో తిరిగి కొద్ది వరకు గాడిలో పడిన గోపీచంద్ ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు పక్కా కమర్షియల్ మూవీ తో వచ్చేయగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక సినిమా ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ రేంజ్….
15 కోట్లకు పైగా ఉండగా నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రం సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. సినిమా కి మొత్తం మీద డిజిటల్, శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా….
31 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయినట్లు సమాచారం. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ ఇది సెన్సేషనల్ రేటు అనే చెప్పాలి. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి బిగ్ బ్యానర్స్ ఉండటం క్వాలిటీ పరంగా ఎక్స్ లెంట్ గా ఉండటం లాంటివి కలిసి వచ్చి ఈ రేంజ్ రేటుని సొంతం చేసుకున్న సినిమా నిర్మాతలకు సాలిడ్ ప్రాఫిట్స్ ని తీసుకువచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.