అజ్ఞాతవాసి సినిమా తర్వాత తన పూర్తీ సమయాన్ని రాజకీయాలకే కేటాయించడం మొదలు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కొన్ని కారణాల వలన రాజకీయాలతో పాటు సినిమాలకు కూడా కొంత సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడువుగా వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పింక్ రీమేక్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ…
తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో కమర్షియల్ మూవీ ఇలా పవర్ స్టార్ కమిట్ మెంట్స్ సాలిడ్ గా ఉన్నాయి. పింక్ రీమేక్ బడ్జెట్ లోనే అవుతుండగా ఈ సినిమా తో పాటు క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న పాన్ ఇండియా మూవీ బడ్జెట్ ఎంత అన్నది ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది…
ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం ఈ సినిమా కి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పక్కకు పెట్టి సుమారు 80 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిస్తున్నారు అన్న టాక్ ఉంది. పవర్ స్టార్ రెమ్యునరేషన్ మినిమమ్ 30 నుండి 40 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.
అవి కూడా యాడ్ చేస్తే సినిమా బడ్జెట్ 110 కోట్ల నుండి 120 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ నిజం అయితే రీసెంట్ టాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీస్ లో ఇదే లో బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ క్రిష్ ఇది వరకు కూడా లో బడ్జెట్ లోనే…
గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి విజువల్ వండర్ ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ అనుభవం తోనే ఇప్పుడు మిగిలిన పాన్ ఇండియన్ తెలుగు మూవీస్ తో పోల్చుకుంటే తక్కువ బడ్జెట్ లోనే హిస్టారికల్ నేపధ్యంలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో రావాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల వలన వచ్చే ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది.