Home గాసిప్స్ ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ కాదు…ఎన్టీఆర్30 లో రోల్ ఇదే!!

ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ కాదు…ఎన్టీఆర్30 లో రోల్ ఇదే!!

0

     టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుండి ఫుల్ ఫామ్ లో దూసుకు పోతుండగా అరవింద సమేత తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన తర్వాత దాదాపు రెండేళ్లుగా ఒకే సినిమా కోసం సమయం కేటాయించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న ప్రస్టీజియస్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో బిజీ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ ని తనకి అరవింద సమేత తో కెరీర్ బెస్ట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో ఒక టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే.

“అయినను పోయి రావలె హస్తినకు” అన్న టైటిల్ ని రిజిస్టర్ చేయించగా ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ టైటిల్ తో ఈ సినిమా లో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ రోల్ లో నటించ బోతున్నారు అన్న టాక్ అంతటా స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ రోల్ పొలిటికల్ లీడర్ కాదని, ఒక బిజినెస్ టైకూన్ రోల్ లో ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తారని, సినిమా ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటుందని అంటున్నారు. మళ్ళీ బిజినెస్ టైకూన్ అన్న వార్తలలో…

రీసెంట్ త్రివిక్రమ్ మూవీస్ లో మెయిన్ థీం అయిన బిజినెస్ షేర్స్ చుట్టే కథ మళ్ళీ తిరుగుతుందా అన్న టాక్ కూడా ఉందని చెప్పొచ్చు. ఇందులో ఎంతవరకు నిజం ఉందీ అన్నది చెప్పలేం కానీ ఎన్టీఆర్ బర్త్ డే రోజున సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ అయ్యాక ఒక అంచనాకి రావచ్చు అంటున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here