Home న్యూస్ నంబర్ 1 రికార్డ్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ టార్గెట్!!

నంబర్ 1 రికార్డ్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ టార్గెట్!!

0

     ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యం లో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో బిజీ అయిన విషయం తెలిసిందే, రోజు ఎదో ఒక ట్రెండ్ తో బిజీ గా ఉంటున్న ఫ్యాన్స్ సినిమాల ట్రెండ్స్ తో లాక్ డౌన్ ని బోర్ కొట్టకుండా చూసు కుంటు న్నారు. ఇక ఈ మధ్య దాదాపు అందరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఒక్కో సినిమా ట్రెండ్ రికార్డ్ బ్రేక్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు.

ముందు మహేష్ బాబు ఫ్యాన్స్ భరత్ అనే నేను ట్రెండ్ తో 2.75 మిలియన్ ట్వీట్స్ వేసి పాత రికార్డ్ అయిన ఆర్య 2 ట్రెండ్ 1.2 మిలియన్ ని బ్రేక్ చేయగా… తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ ట్రెండ్ తో ఏకంగా 4 మిలియన్ ట్వీట్స్ ని నమోదు చేసి దుమ్ము లేపారు.

ఇక ఈ రికార్డ్ ను కొద్ది రోజుల్లోనే బ్రేక్ చేసిన మహేష్ ఫ్యాన్స్ ఏకంగా 8.47 మిలియన్ ట్వీట్స్ ని పోకిరి ట్రెండ్ లో పోల్ చేసి ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశారు, ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రికార్డ్ ట్రెండ్ నే టార్గెట్ చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్ లో ఒకటైన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి 8 ఏళ్ళు అవుతున్న నేపధ్యం ఈ నెల 10 న భారీ ట్రెండ్ ని చేయడానికి సిద్ధం అవుతున్నారు, ఈ ట్రెండ్ లో అన్ని సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ బెండు తీయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న పోకిరి ట్రెండ్ టార్గెట్ చాలా పెద్దదే అయినా ఇది వరకు బర్త్ డే ట్రెండ్స్ విషయం లో పవర్ స్టార్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేసి సంచలన రికార్డ్ నమోదు చేయాలి అని చూస్తున్నారు. మరి వీళ్ళ రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here