బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ గేమ్ చేంజర్ మూవీ తో భారీ గా ఎదురుదెబ్బ తిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు భారీ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ అయిన పెద్ది(Peddi Movie) ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా….రీసెంట్ గా శ్రీరామనవమి రోజున…
సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు….ఆ గ్లిమ్స్ లో రామ్ చరణ్ రగ్గుడ్ లుక్ అండ్ ఎలివేషన్స్ కి డైలాగ్స్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ లో సొంతం అవుతూ ఉండగా గ్లిమ్స్ ఆల్ రెడీ సాలిడ్ రికార్డులతో దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం కాగా…
ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో గ్లిమ్స్ ల పరంగా ఆల్ టైం రికార్డ్ ను 24 గంటలు కాక ముందే బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ తో సంచలనం సృష్టించింది… టాలీవుడ్ లో గ్లిమ్స్ ల పరంగా ఇది వరకు వచ్చిన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అయిన…
దేవర(Devara Movie) గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు 24 గంటల్లో వ్యూస్ పరంగా 26.17 మిలియన్ వ్యూస్ తో టాలీవుడ్ రికార్డ్ ను క్రియేట్ చేయగా…ఇప్పుడు ఆ రికార్డ్ ను 18 గంటల టైం కే బ్రేక్ చేసిన పెద్ది గ్లిమ్స్ ప్రస్తుతం 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను…
భారీ మార్జిన్ తో నమోదు చేస్తూ దూసుకు పోతుంది. వ్యూస్ పరంగా కొత్త రికార్డులతో సంచలనం సృష్టిస్తూ మాస్ ఊచకోత కోస్తున్న పెద్ది గ్లిమ్స్ లైక్స్ పరంగా మాత్రం వెనకబడిపోయింది… ఇప్పటికీ 4 లక్షల లోపే లైక్స్ మార్క్ ని అందుకోగా దేవర 7 లక్షలకు పైగా లైక్స్ ను…
భీమ్లా నాయక్, ఓజి గ్లిమ్స్ లాంటివి లైక్స్ విషయంలో టాప్ ప్లేస్ లో అలానే ఉన్నాయి. మొత్తం మీద వ్యూస్ పరంగా మాత్రం పెద్ది గ్లిమ్స్ టాలీవుడ్ లో ఉన్న రికార్డులను అన్నీ బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ లను సాలిడ్ మార్జిన్ తో నమోదు చేసిందని చెప్పాలి ఇప్పుడు.