Home న్యూస్ పెద్ది గ్లిమ్స్ రివ్యూ….రామ్ చరణ్ మాస్ ఊచకోత!!

పెద్ది గ్లిమ్స్ రివ్యూ….రామ్ చరణ్ మాస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ భారీ లెవల్ లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా, ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు…

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది(Peddi Movie) టైటిల్ ను కన్ఫాం చేస్తూ రామ్ చరణ్ పుట్టిన రోజు టైంలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా రెస్పాన్స్ ఊరమాస్ అనిపించే రేంజ్ లో సొంతం అవ్వగా ఇప్పుడు శ్రీరామనవమి టైంలో…

సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ను కన్ఫాం చేస్తూ అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. గ్లిమ్స్ చూస్తుంటే డిసాస్టర్ తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… గ్లిమ్స్ లో రామ్ చరణ్ లుక్స్ ఆల్ మోస్ట్ రంగస్థలం సినిమా తర్వాత…

ఆ రేంజ్ ని మ్యాచ్ చేసే విధంగా ఉండగా సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించబోతూ ఉండగా…గ్లిమ్స్ లో ‘ఓటే పనిసేసేనాకి… ఒకేనాగ బతికేనాకి… ఇంత పెద్ద బతుకేందుకు… ఏదైనా ఈ నెలమీదున్నప్పుడే సేసేయాల… పుడతామా ఏటి మల్లీ…సెప్మీ’ అంటూ చెప్పిన డైలాగ్…

కంప్లీట్ రగ్గుడ్ రేంజ్ లో దుమ్ము లేపింది అని చెప్పాలి. ఓవరాల్ గా గ్లిమ్స్ సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది అని చెప్పాలి. ఇక పెద్ది సినిమా బాక్స్ అఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా…

మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుందని కన్ఫాం చేశారు. మొత్తం మీద గ్లిమ్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గేమ్ చేంజర్ లాంటి రిజల్ట్ తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ ఇస్తుంది అనిపించగా రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది. ఇక 24 గంటల్లో గ్లిమ్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here