ఒక్క పాటతో సాలిడ్ హైప్ ను సొంతం చేసుకున్న సినిమాగా పొగరు సినిమాను చెప్పుకోవాలి. కేవలం ఒక్క సాంగ్ తో ఆల్ సౌత్ భాషల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు దృవ్ సార్జా హీరోగా నటిస్తుండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై కన్నడ లో సెన్సేషనల్ క్రేజ్ ఉంది. దాంతో ఆ క్రేజ్ మిగిలిన చోట్ల పాకేలా సాంగ్ ని తమిళ్ లో తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేశారు..
దాంతో ఇక్కడ క్రేజ్ సాలిడ్ గా పెరిగి పోగా సినిమా ని కొని రిలీజ్ చేయడానికి బయ్యర్లు బాగానే ఎగబడ్డారు. దాంతో సినిమా బిజినెస్ జోరుగా సాగగా తెలుగు రైట్స్ ని సుమారు 3.35 కోట్ల రేంజ్ లో కొన్నారు. అప్పుడే అందరూ ఈ రేటు చూసి ఒక డబ్బింగ్ మూవీ కి ఒక్క పాటతో…
ఇంత రేటు ఏంటి అంటూ ఆశ్యర్యపోయారు. ఇక ఆ రేటే ఎక్కువ అనుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రలలో సినిమా సాధించిన బిజినెస్ మరింత ఆశ్యర్యపరిచింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన బిజినెస్ ను గమనిస్తే… నైజాం ఏరియా లో ఈ సినిమా…
1.6 కోట్ల బిజినెస్ ను సాధించగా సీడెడ్ లో 40 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక టోటల్ ఆంద్రలో ఈ సినిమా 1.7 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు 3.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…
4 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే సినిమా భారీ పోటి లో అలాగే ఉప్పెన నుండి కూడా పోటి ని తట్టుకుని ఈ కలెక్షన్స్ ని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఎంతవరకు సినిమా రికవరీ చేస్తుంది అన్నది చెప్పలేం కానీ మాస్ మూవీ కాబట్టి మాస్ సెంటర్స్ లో జోరు చూపితే చాన్స్ ఉందని చెప్పాలి.