కన్నడ డబ్ మూవీ పొగరు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ పరంగా దుమ్ము లేపింది, రీసెంట్ టైం లో సాంగ్స్ రీచ్ సాలిడ్ గా ఉంటే ఓపెనింగ్స్ అడిరిపోతున్నాయి… ఈ సినిమా విషయంలో కూడా ఇది నిజం అయింది… పాటల వలనే తెలుగు లో క్రేజ్ ని సొంతం చేసుకుని బిజినెస్ సాధించిన ఈ సినిమా, హిరోయిన్ ఫాక్టర్ అండ్ సాంగ్స్ వలన ఏకంగా 3.7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది.
ఇక సినిమా ఫిబ్రవరి 19 న రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో అసలు మనకు ఏమాత్రం టచ్ లేని హీరోనే అయినా ఓపెనింగ్స్ పరంగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల విషయానికి వస్తే మిగిలిన అన్ని కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.
కానీ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయానికి వచ్చే సరికి మాస్ సెంటర్స్ లో హోల్డ్ చేసినా మిగిలిన సెంటర్స్ లో స్లో డౌన్ అయింది. అయినా కానీ సినిమా మొదటి రోజు అంచనాలను మించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. సినిమా డే 1…
రెండు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షలకు తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా ఏకంగా 76 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది, ఒకసారి ఆ షేర్ వివరాలను గమనిస్తే…
👉Nizam: 29L
👉Ceeded: 17L
👉UA: 12L
👉East: 4.3L
👉West: 3L
👉Guntur: 4.2L
👉Krishna: 3.9L
👉Nellore: 2.2L
AP-TG Total:- 0.76CR (1.35Cr Gross~)
ఇవీ ఫస్ట్ డే సినిమా కలెక్షన్స్..
సినిమాను మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 3.7 కోట్ల కి అమ్మగా 4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తర్వాత సినిమా ఇప్పుడు 3.24 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక….