Home న్యూస్ పొలిమేర2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

పొలిమేర2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

పాండమిక్ టైంలో డిజిటల్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఆకట్టుకున్న సినిమాల్లో చిన్న సినిమా మా ఊరి పొలిమేర ఒకటి….ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మా ఊరి పొలిమేర2(Maa Oori Polimera2 Movie) ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాలతో ఇప్పుడు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…అందరూ చనిపోయాడు అనుకున్న సత్యం రాజేష్ కేరళలో తన ప్రేయసితో కనిపించడంతో ఎండ్ అయిన పార్ట్ 1 కి కంటిన్యూగా మొదలయ్యే పార్ట్ 2 లో సత్యం రాజేష్ ను వెంబడిస్తూ తన తమ్ముడు అయిన బాలాదిత్య ఏం చేశాడు….ఆ ఊరిలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పార్ట్ 1 చూసిన ఆడియన్స్ కి పార్ట్ 2 ఈజీగా కనెక్ట్ అవుతుంది, చాలా వరకు సీన్స్ ఎంగేజింగ్ గా అనిపిస్తూ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల స్లో అయిన కూడా ఇంటర్వెల్ ఎపిసోడ్ అండ్ టోటల్ ఫస్టాఫ్ లు కుమ్మేయడంతో పార్ట్ 1 చూసిన ఆడియన్స్ ను పార్ట్ 2 సినిమా ఏమాత్రం నిరాశ పరచదు అనే చెప్పాలి…

ఇక పార్ట్ 1 చూడని ఆడియన్స్  కి అయితే మాత్రం సినిమా ఫస్టాఫ్ వరకు బాగానే ఇంప్రెస్ చేస్తుంది, కానీ సెకెండ్ ఆఫ్ లో ట్విస్ట్ లు ఎక్కువ ఉండటంతో సినిమా కొంచం కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది…. మొదటి పార్ట్ కి లింక్ చేసే సీన్స్ మరింత కంఫ్యూజన్ ని క్రియేట్ చేసినా కూడా…

కొన్ని సీన్స్ బాగా మెప్పించడం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకోవడంతో పడుతూ లేస్తూ సాగినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా చూసి బయటికి వచ్చిన ఆడియన్స్ పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది… 

బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా సినిమాలో సత్యం రాజేష్ పెర్ఫార్మెన్స్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉంటుంది…. కొంచం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినా కూడా డైరెక్టర్ మొత్తం మీద డీసెంట్ అటెంప్ట్ తో ఫస్ట్ పార్ట్ లానే రెండో పార్ట్ ను కూడా బాగా డీల్ చేశాడు కానీ ఈ సారి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ గెస్ చేసినట్లే ఉండటంతో పర్వాలేదు అనిపించేలా ఉంటుంది…

ఓవరాల్ గా మొదటి పార్ట్ చూసిన ఆడియన్స్ కి కొంచం ఎక్కువగా నచ్చే అవకాశం ఉన్న పొలిమేర2 సినిమా పార్ట్ 1 చూడని ఆడియన్స్ కి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది… మినిమం అంచనాలతో వెళితే కొంచం అక్కడక్కడా డ్రాగ్ అయినట్లు అనిపించినా ఓవరాల్ గా సినిమా మెప్పించే అవకాశం ఉంది… సినిమా కి ఓవరాల్ గా మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here