Home TRP రేటింగ్ ప్రభాస్ లాస్ట్ 6 మూవీస్ TRP రేటింగ్స్….ఇది ఊహించలేదు!

ప్రభాస్ లాస్ట్ 6 మూవీస్ TRP రేటింగ్స్….ఇది ఊహించలేదు!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా సినిమాకి తన మార్కెట్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటూ ఉండగా బాహుబలి(Baahubali) సిరీస్ తర్వాత ఒక్క రాదే శ్యామ్ సినిమా మాత్రమే అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయింది. మిగిలిన సినిమాలు అన్నీ ఎంతో కొంత జోరు చూపించాయి…

ఇక టెలివిజన్ లో సైతం ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ సాలిడ్ TRP రేటింగ్ లను సొంతం చేసుకోగా తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా అనుకున్న రేంజ్ లో రేటింగ్ లను అందుకోలేక పోయాయి…లేట్ టెలికాస్ట్ అయిన సాహో నిరాశ పరిచే రేటింగ్ ను అందుకోగా రాదే శ్యామ్ మరియు ఆదిపురుష్ లు జస్ట్ ఓకే అనిపించుకున్నాయి.

ఇక ప్రభాస్ రీసెంట్ ఊరమాస్ మూవీ అయిన సలార్(Salaar Movie) టెలివిజన్ లో నిరాశ పరిచే రేటింగ్ ను సొంతం చేసుకుంది… బాహుబలి1 మూవీ 21.54 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన బాహుబలి 2 మూవీ 22.70 టి.ఆర్.పి రేటింగ్ దక్కించుకుని మాస్ రచ్చ చేసింది.

Salaar 9 Days Total WW Collections!

ఇక తర్వాత వచ్చిన సాహో మూవీ 5.81 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన రాదే శ్యామ్ మూవీ 8.25 టి.ఆర్.పి రేటింగ్ ను దక్కించుకుంది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన ఆదిపురుష్ సినిమా కొంచం పర్వాలేదు అనిపిస్తూ 9.47 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంటే…

సలార్ మూవీ 6.5 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకున్నాయి. మొత్తం మీద ప్రభాస్ లాస్ట్ 6 మూవీస్ లో మాస్ మూవీస్ అయిన సాహో మరియు సలార్ మూవీస్ నిరాశ పరిచే రేటింగ్ లను సొంతం చేసుకున్నాయి. టి.ఆర్.పి రేటింగ్ లు ఎలా ఉన్నా ప్రభాస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో మాత్రం రచ్చ చేస్తూ ఉండటం విశేషం….

Salaar 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here