Home Uncategorized 4 కి నాలుగు సినిమాలు ఔట్…ప్రభుదేవా ఏంటిది!!

4 కి నాలుగు సినిమాలు ఔట్…ప్రభుదేవా ఏంటిది!!

0

2005 లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో కెరీర్ ని డైరెక్టర్ గా మొదలు పెట్టిన ప్రభుదేవా ఆ సినిమా విజయం తో పౌర్ణమి లాంటి సినిమా చాన్స్ కొట్టేసినా ఫ్లాఫ్ అందుకున్నాడు, తర్వాత తెలుగు పోకిరి ని తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. తెలుగు లో శంకర్ దాదా జిందాబాద్ తో మరో ఫ్లాఫ్ పడింది… ఇలాంటి టైం లో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రభుదేవా…

పోకిరి హిందీ రీమేక్ గా వాంటెడ్ ని తీయగా ఆ సినిమా విజయం తో డైరెక్టర్ గా ప్రభుదేవాకి అక్కడ డిమాండ్ పెరిగింది. తర్వాత అక్షయ్ కుమార్ తో చేసిన విక్రమార్కుడు రీమేక్ రౌడీ రాథోర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వరుస పెట్టి ఆఫర్స్ వచ్చేలా చేశాయి.

కానీ అప్పటి నుండి డైరెక్టర్ గా ప్రభుదేవా ఎక్కువ శాతం నిరాశ పరిచే సినిమాలే చేశాడు… నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిందీ లో రామయ్యా వస్తావయ్యా పేరుతో రీమేక్ చేసి ఫ్లాఫ్ అందుకోగా షాహిద్ కపూర్ తో చేసిన ఆర్ రాజ్ కుమార్ పర్వాలేదు అనిపించుకుంది.

అంతే ఇక అప్పటి నుండి ప్రభుదేవా డైరెక్షన్ లో వచ్చిన ప్రతీ సినిమా తీవ్రంగా నిరాశాపరచడం మొదలు పెట్టాయి… అజయ్ దేవగన్ తో చేసిన యాక్షన్ జాక్సన్ అట్టర్ డిసాస్టర్ అవ్వగా తర్వాత అక్షయ్ కుమార్ తో చేసిన సింగ్ ఈజ్ కింగ్ సీక్వెల్ సింగ్ ఈజ్ బ్లింగ్ మరో ఫ్లాఫ్ అయ్యింది… ఇక తర్వాత సల్మాన్ తో జోడి కట్టిన ప్రభుదేవా ఇప్పుడు సల్మాన్ కి…

బాక్ టు బాక్ 2 బ్యాడ్ మూవీస్ ఇచ్చాడు, దబాంగ్ సిరీస్ సీక్వెల్ దబాంగ్ 3 ఫ్యాన్స్ ని అందరినీ నిరాశ పరచి ఫ్లాఫ్ అవ్వగా ఇప్పుడు వాంటెడ్ సీక్వెల్ రాధే అయితే అన్ని సినిమాల లోకి వరస్ట్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా అంటూ లోవేస్ట్ రేటింగ్స్ ని సాధించింది. దాంతో డైరెక్టర్ గా ప్రభుదేవా ప్రస్తుతం చాలా డౌన్ సైడ్ లో ఉన్నాడని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here