బాక్స్ ఆఫీస్ దగ్గర మన సినిమాల కన్నా ఇతర భాషల సినిమాల మీద ఆసక్తి ఎక్కువ అయిపోతుంది టాలీవుడ్ ఆడియన్స్ కి. మన దగ్గర కూడా కొత్త తరహా సినిమాలు వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు, అదే టైంలో రొటీన్ మాస్ స్టఫ్ తో కూడా సినిమాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు…
అదే టైంలో పరాయి సినిమా స్లోగా ఉన్నా, రొటీన్ కథతోనే వచ్చినా కూడా వాటిని ఎక్కువగా ఆదరిస్తున్నారు….లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన సినిమాల వర్కింగ్ డేస్ బుకింగ్స్ ను చూస్తూ ఉంటే ఇదే రుజువు అవుతుంది కూడా…మలయాళం నుండి వచ్చిన డబ్బింగ్ మూవీ ప్రేమలు(Premalu Movie) రోజు రోజుకి జోరు పెంచుతూ…
6వ రోజు ఏకంగా లాస్ట్ వీక్ లో వచ్చిన గోపీచంద్(Gopichand) భీమా(Bhimaa Movie) అలాగే విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) కన్నా కూడా ఎక్కువ టికెట్ సేల్స్ జరిగాయి. అది కూడా 2 తెలుగు సినిమాల టికెట్ సేల్స్ కన్నా కూడా ప్రేమలుకి ఎక్కువ టికెట్స్ తెగాయి…
గామికి 6వ రోజు మొత్తం మీద బుక్ మై షోలో 5.3K టికెట్స్ తెగాయి…అదే టైంలో భీమా సినిమాకి 6వ రోజున 5.4K లోపు టికెట్స్ తెగాయి…అదే టైంలో ప్రేమలు తెలుగు డబ్ వర్షన్ కి 6వ రోజు మొత్తం మీద 11.4K రేంజ్ లో టికెట్స్ తెగాయి…అంటే 2 స్ట్రైట్ మూవీస్ కలిపితే 10.7 టికెట్స్ తెగితే….
డబ్బింగ్ మూవీ కి మాత్రం డబుల్ రేంజ్ లో టికెట్స్ తెగాయి….ఎంటర్ టైన్ మెంట్ ఉండటంతో కాలేజ్ యూత్ యూనిక్ కాన్సెప్ట్ ను, మాస్ మూవీ కన్నా లవ్ స్టొరీకే ఎక్కువే ప్రిఫెరెన్స్ ఇస్తున్నారు… దాంతో డబ్బింగ్ మూవీ దుమ్ము లేపుతుంటే తెలుగు మూవీస్ మాత్రం ఇప్పుడు స్లో అవ్వక తప్పడం లేదు…