Home న్యూస్ 7 ఏళ్ల క్రితం మూవీ….OTT లో బ్లాక్ బస్టర్…ఇప్పుడు రచ్చకి సిద్ధం!

7 ఏళ్ల క్రితం మూవీ….OTT లో బ్లాక్ బస్టర్…ఇప్పుడు రచ్చకి సిద్ధం!

0

అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు అనుకున్న టైంకి రాక్ పోవడంతో నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ ఉంటాయి, అలాంటి కొన్ని సినిమాలలో సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నటించిన ప్రాజెక్ట్ Z(Project Z Movie) కూడా ఒకటి…ఈ సినిమా 2017 టైంలో తమిళ్ లో రూపొందింది…

అక్కడ వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా, తెలుగు లో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎప్పటి కప్పుడు ఏవో ఇబ్బందుల వలన థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు, కానీ కోవిడ్ టైంలో ఈ సినిమా తెలుగు డిజిటల్ రిలీజ్ లో సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచి సాలిడ్ గా వ్యూవర్ షిప్ వచ్చింది….

ఇంత మంచి సినిమా థియేటర్స్ లో మిస్ అయ్యామని చాలా మంది అనుకున్నారు, అలాంటి ఈ సినిమా ఎట్టకేలకు తెలుగు లో ఇప్పుడు ఈ వీకెండ్ లోనే రీ రిలీజ్ చేస్తున్నారు… తెలుగు వర్షన్ కి సందీప్ కిషన్ తో డబ్బింగ్ చెప్పించి ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తూ ఉండటంతో అప్పుడు థియేటర్స్ లో మిస్ అయిన ఈ మంచి సినిమాను….

ఇప్పుడు చూడాలని సోషల్ మీడియాలో సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…. అనుకున్న టైంకే సినిమా అప్పట్లోనే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే సందీప్ కిషన్ కి మంచి సక్సెస్ గా తెలుగు లో నిలిచి ఉండేది. మరి ఇప్పుడు 7 ఏళ్లకి తెలుగు లో వస్తున్న ఈ సినిమా కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here