Home న్యూస్ ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మృణాల్ ఠాకూర్ ల కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(Family Star Movie Review) సమ్మర్ లో బిగ్ రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు రాగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా…

స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ అయిన హీరో తన ఫ్యామిలీతో కలిసి ఉంటూ లైఫ్ లో ఎదగడానికి ట్రై చేస్తూ మరో పక్క తన ఇంటి పైకి వచ్చిన హీరోయిన్ తో లవ్ లో పడగా తన లైఫ్ లో తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందని అంటున్నారు…

సినిమా స్టార్ట్ అవ్వడం సింపుల్ గానే స్టార్ట్ అవ్వగా కొన్ని ఆకట్టుకునే ఫ్యామిలీ సీన్స్ అలాగే హీరో హీరోయిన్ ల క్యూట్ సీన్స్ తో సరదా సరదాగా ఫస్టాఫ్ ఉంటుందని, సెకెండ్ ఆఫ్ కథ కొంచం అక్కడక్కడా డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కొన్ని చోట్ల మాస్ సీన్స్ తో కూడా మాస్ కి నచ్చేలా సినిమాను రూపొందించారని అంటున్నారు…

విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఆకట్టుకోగా హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో కూడా కుమ్మేశాడని అంటున్నారు, పాటలు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయని, ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో ఉంది అన్న టాక్ మొత్తం మీద సినిమా ప్రీమియర్స్ నుండి వినిపిస్తుంది అని చెప్పాలి…

మట్టం మీద ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ స్టార్ మూవీ కి ఎబో యావరేజ్ కి అటూ ఇటూగా టాక్ అయితే వినిపిస్తుంది, మొత్తం మీద విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ లో అన్ని ఎలిమెంట్స్ ని బాగా మిక్స్ చేసిన తీసిన సినిమాగా ఫ్యామిలీ స్టార్ మూవీ ఉందని అంటూ ఉండటంతో…..

రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియన్స్ అండతో సమ్మర్ హాలిడేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు సినిమా కి ఫైనల్ గా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here