Home న్యూస్ పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్స్’ రివ్యూ….చివరి సారి నివాళి!

పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్స్’ రివ్యూ….చివరి సారి నివాళి!

0

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు లాస్ట్ ఇయర్ హార్ట్ స్ట్రోక్ కారణంగా సడెన్ గా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అశేష అభిమానులను శోకసముద్రంలో మునిగేలా చేసిన పునీత్ రాజ్ కుమార్ మరణం ఇతర ఇండస్ట్రీలను కూడా తీవ్రంగా కలిచివేసింది. ఇక కన్నడలో సినీ లవర్స్ సామాన్య ప్రేక్షకులు కూడా పునీత్ మరణాన్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితి ఉండగా ఎలాగైనా పునీత్ కి ఘన నివాళి ఇవ్వాలి అని….

పునీత్ రాజ్ కుమార్ నటించిన లాస్ట్ మూవీ జేమ్స్ ని పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు అయిన మార్చ్ 17 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేయగా కర్ణాటకలో ఈ వారం పాటు మరే సినిమా రిలీజ్ లేకుండా ఒక్క జేమ్స్ సినిమానే ప్రదర్శించబోతున్నారు… ఇక జేమ్స్ సినిమా ఎలా ఉంది అన్నది పక్కకు పెడితే….

చివరి సారి పునీత్ రాజ్ కుమార్ వెండి తెరపై చూసిన తర్వాత అభిమానులే కాదు ఇతర ఇండస్ట్రీల ఫ్యాన్స్ అయిన మనం కూడా కచ్చితంగా ఎమోషనల్ అయిపోవడం మాత్రం ఖాయం అని చెప్పాలి. ఇక అభిమానులు అయితే కచ్చితంగా చివర్లో కళ్ళలో నీళ్ళు తిరగడం ఖాయమని చెప్పాలి…

తన చివరి సినిమాలో కూడా హీరోయిజం ఎలివేట్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ డాన్స్ కానీ ఉన్న ప్రతీ అంశాన్ని బాగా చేసి మెప్పించాడు పునీత్ రాజ్ కుమార్… హీరో నటించిన చివరి సినిమాలో ఇవన్నీ చూసే ఆడియన్స్ ఎమోషనల్ అయిపోవడం ఖాయం… కథ పెద్దగా బలంగా ఏమి లేక పోయినా కానీ జస్ట్ హీరో కోసం తనని చివరి సారి…

చూడాలి అనుకున్న వాళ్ళకి సినిమాలో కథ కూడా ఏమి కనిపించదు, ప్రతీ సీన్ లో హీరో నే కనిపిస్తాడు… ఇక సినిమాలో ఫైట్ సీన్స్ మాత్రం అద్బుతంగా ప్లాన్ చేసుకుని చివరి సారి అభిమానులను ఆ విషయంలో ఫుల్ సాటిస్ ఫై చేశాడు హీరో… ఇక ఎండ్ కార్డ్ టైం కి పునీత్ గారి మీద వచ్చే స్లైడ్ షో మాత్రం కచ్చితంగా మనల్ని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది… ఈ సినిమా లాస్ట్ టైం పునీత్ గారి కోసం ఒక్కసారి కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here