Home న్యూస్ పుష్ప తమిళ్ బిజినెస్ క్లోజ్…రేటు ఎంత…క్లీన్ హిట్ కి ఎంత కావాలి!

పుష్ప తమిళ్ బిజినెస్ క్లోజ్…రేటు ఎంత…క్లీన్ హిట్ కి ఎంత కావాలి!

0

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప, బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున వచ్చే నెల 17 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న నేపద్యంలో అన్ని చోట్లా ఎలాంటి బిజినెస్ జరుగుతుంది, సినిమా ఎలా పెర్ఫార్మ్….

చేస్తుంది అన్న చర్చలు ఆల్ రెడీ జరుగుతున్నాయి. క్రిస్టమస్ కి వారం ముందు రిలీజ్ అవుతున్న ఈ సినిమా కి పోటి గా స్పైడర్ మాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అయినా కానీ పుష్ప కి అన్ని చోట్లా సాలిడ్ గానే బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండగా….

   

రీసెంట్ గా సినిమా తమిళ్ రైట్స్ ని అమ్మేశారు. పోటి లో చాలా మంది ముందుకు వచ్చినా కానీ చివరికి కోలివుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకరు, అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమాను అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఈ సినిమాను…

తమిళనాడులో డిసెంబర్ 17 న భారీ ఎత్తున్న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండగా సినిమా తమిళనాడు లో ఓవరాల్ గా ఏ రేటుకి అమ్మారో కూడా తెలిసింది. సినిమాను మొత్తం మీద 5.5 కోట్ల రేటు కి తమిళనాడులో అమ్మారని సమచారం. ఈ లెక్కన సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 11.5 కోట్ల రేంజ్ నుండి 12 కోట్ల దాకా ఓవరాల్ గ్రాస్ ను అక్కడ…

సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా కంటెంట్ తమిళ్ ఆడియన్స్ కి నచ్చే అవకాశం కూడా ఎంతైనా ఉన్న నేపధ్యంలో కచ్చితంగా ఆకట్టుకునే అవకాశం అయితే ఎంతైనా ఉంది, ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అక్కడ సినిమా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here