రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టిస్తూ దుమ్ము లేపే రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) నాలుగో వీక్ లో కూడా సాలిడ్ గా జోరు చూపెడుతూ ఉండగా…
ఒక చోట మాత్రం రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది….అదే కేరళ ఏరియా…అల్లుఅర్జున్ కి మొదటి నుండి మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ ఏరియాలో సినిమా ఓపెనింగ్ డే కుమ్మేసినా కూడా అక్కడ సినిమాకి మిక్సుడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ క్లియర్ గా కనిపించి…
వీకెండ్ తర్వాత నుండి డ్రాప్స్ ను కంటిన్యూగా సొంతం చేసుకోవడం మొదలు పెట్టిన సినిమా రెండో వీక్ నుండి మరింత స్లో అయ్యి తర్వాత చాలా లిమిటెడ్ థియేటర్స్ లోనే రన్ ను కొనసాగించగా ఇప్పుడు ఓవరాల్ గా అక్కడ రన్ ను ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది.
కేరళలో సినిమాకి ఉన్న క్రేజ్ దృశ్యా ఏకంగా 20 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ జరిగింది….టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా అటూ ఇటూగా 7.60 కోట్ల రేంజ్ లో షేర్ తో రన్ ను కంప్లీట్ చేసుకోగా గ్రాస్ కలెక్షన్స్ పరంగా సినిమా 18.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో…
రన్ ను కంప్లీట్ చేసుకోబోతుంది….మొత్తం మీద పెట్టిన అమౌంట్ లో 12.40 కోట్ల రేంజ్ లో లాస్ ను సినిమా కేరళలో సొంతం చేసుకుని అక్కడ డబుల్ డిసాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు. మిగిలిన చోట్ల సినిమా కి మంచి కలెక్షన్స్ సొంతం అయినా కూడా…
అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉండే కేరళలో ఇంకా చాలా బెటర్ కలెక్షన్స్ ని ఎక్స్ పెర్ట్ చేసినా కూడా అలాంటిది ఏమి జరగలేదు… ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా మంచి లాభాలను సొంతం చేసుకున్నా కూడా ఇక్కడ మాత్రం సినిమా డబుల్ డిసాస్టర్ గా నిలిచింది…