బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా రెండు వారాల్లో ఎపిక్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది…మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా వీకెండ్ లో… బాక్స్ అఫీస్ దగ్గర…
మరిన్ని రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది….ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లో సాధిస్తున్న కలెక్షన్స్ ఒకెత్తు అయితే మహారాష్ట్రలో సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ మరో ఎత్తు అని చెప్పాలి. రిమార్కబుల్ జోరుని ఇక్కడ చూపెడుతూ దూసుకు పోతున్న…
ఛావా సినిమా ఇప్పుడు అక్కడ ఆల్ టైం కలెక్షన్స్ తో ఎపిక్ రికార్డులను నమోదు చేసిన పుష్ప2 మూవీ టోటల్ రన్ లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. అది కూడా కేవలం 15 రోజుల టైం కే బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప2 మూవీ…
సాధించిన కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం అన్నది మామూలు విషయం కాదు…పుష్ప2 మూవీ టోటల్ రన్ లో ఒక్క మహారాష్ట్ర ఏరియాలో 240 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఆల్ మోస్ట్ 15 రోజుల్లో విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ ఈ కలెక్షన్స్ ని…
ఆల్ మోస్ట్ అందుకుని మాస్ ఊచకోత కోసింది…ఛావా సినిమా మహారాష్ట్రలో చూపించిన రేంజ్ భీభత్సం మిగిలిన అన్ని ఏరియాల్లో కూడా చూపించి ఉంటే ఏకంగా పుష్ప2 రేంజ్ కి ఏమాత్రం తీసిపోని రికార్డులను ఇండియా మొత్తం సొంతం చేసుకునేది. ఇక సినిమా లాంగ్ రన్ లో మహారాష్ట్రలో ఏ రేంజ్ లో కొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.