Home న్యూస్ పుష్ప2 టీసర్ రివ్యూ….ఇది ఊహించలేదు!

పుష్ప2 టీసర్ రివ్యూ….ఇది ఊహించలేదు!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్(Sukumar) ల క్రేజీ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్1(Pushpa The Rise) అల్టిమేట్ రీచ్ ను సొంతం చేసుకుని భారీ విజయాన్ని నమోదు చేయగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సినిమా పార్ట్2(Pushpa The Rule) తో ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా సినిమా…

అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు….లాస్ట్ ఇయర్ కూడా అల్లు అర్జున్ పుట్టిన రోజున వేర్ ఈజ్ పుష్ప అంటూ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా ఆ గ్లిమ్స్ కి నెక్స్ట్ లెవల్ లో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు వచ్చిన టీసర్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి…

ఇక టీసర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలను పూర్తిగా అందుకుందా లేదా అంటే మాత్రం మిక్సుడ్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు..ఇది టీసర్ కన్నా గ్లిమ్స్ అంటేనే బాగుంటుంది… సినిమాలో మేజర్ హైలెట్ గా చెప్పుకుంటున్న జాతర ఫైట్ సీన్ కి సంభందించిన ఒక క్లిప్ ను టీసర్ గా కట్ చేసి రిలీజ్ చేశారు..

అల్లు అర్జున్ లుక్ టెర్రిఫిక్ గా ఉండగా ఇలాంటి గెట్ అప్ ని ట్రై చేయడం విషయంలో మాత్రం అల్లు అర్జున్ ని మెచ్చుకుని తీరాల్సిందే…. ఇలాంటి లుక్ తో టీసర్ నే రిలీజ్ చేయాలనీ ఎవ్వరూ ట్రై కూడా చేయరు….చీర కట్టిన విధానం, అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ మాస్ అంతే….

ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించేలా ఉండగా సుకుమార్ ఫ్రేమ్స్ బాగానే సెట్ చేశాడు టీసర్ లో…. ఓవరాల్ గా గ్లిమ్స్ తో పోల్చితే టీసర్ లో పెద్దగా ఏమి రివీల్ చేయకుండా జస్ట్…

ఒక ఫైట్ సీన్ లో బిట్ ను మాత్రమే టీసర్ కట్ గా రిలీజ్ చేశారు మేకర్స్… అయినా కూడా ఓవరాల్ గా సినిమా మీద ఉన్న హైప్ కి రిలీజ్ టైంలో ఏమాత్రం పాజిటివ్ టాక్ సినిమాకి వచ్చినా ఆల్ ఇండియా రికార్డులను సైతం సినిమా టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక టీసర్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here