Home న్యూస్ పుష్పకవిమానం మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!

పుష్పకవిమానం మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!

0

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ పుష్పక విమానం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయింది, మొదటి సినిమా దొరసాని బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందుకోకున్నా రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడిస్ డిజిటల్ లో మంచి హిట్ గా నిలిచింది, మరి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్పక విమానం ఎలా ఉంది ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసు కుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే… గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయిన హీరోని పెళ్లి చేసుకున్న గీత సైని పెళ్లి అయిన తర్వాత ఇల్లు విడిచి పారిపోతుంది… చుట్టుపక్కల వాళ్ళ ముందు పరువు పోతుంది అని మరో అమ్మాయిని తన భార్యగా నాటకం ఆడినా తర్వాత పెళ్ళికూతురు పారిపోతుంది అని అందరికీ తెలుస్తుంది…

తర్వాత ఏమయింది, అసలు పెళ్ళికూతురు ఎందుకు పారిపోయింది, చివరికి ఏమయింది అన్నది సినిమా కథ, పెర్ఫార్మెన్స్ పరంగా ఆనంద్ దేవరకొండ ఈ రోల్ కి పెర్ఫెక్ట్ సెట్ అయ్యాడు, బాగా నటించాడు, సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు, అమ్మాయిలు ఇద్దరూ పర్వాలేదు అనిపించగా ఇతర రోల్స్ కూడా పర్వాలేదు అనిపించుకున్నారు.

కథ ఆకట్టుకునే మొదలు అయ్యి మంచి ఆసక్తిని కలిగజేస్తూ కామెడీ తో ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోయి సెకెండ్ ఆఫ్ పై మంచి ఇంప్రెషన్ ఇచ్చేలా ఎంటర్ టైన్ చేసింది, అదే టైం లో సెకెండ్ ఆఫ్ లో సినిమా ఇన్వెస్టిగేషన్ నరేషన్ తో సీన్స్ రిపీటివ్ గా అనిపించడం, కథ చాలా నెమ్మదిగా సాగడంతో సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పిపోయి…

రొటీన్ క్లైమాక్స్ తో ముగుస్తుంది, ఓ మంచి ఆరంభాన్ని డైరెక్టర్ సెకెండ్ ఆఫ్ లో మెయిన్ టైన్ చేయలేక పోయాడు. కానీ పార్టు పార్టులుగా సినిమా ఎంటర్ టైన్ మెంట్ వరకు పర్వాలేదు అనిపించడంతో సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పినా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ముగుస్తుంది, క్లైమాక్స్ అయినా ఏమైనా కొత్తదనం ఉంటుంది అనుకుంటాం కానీ…

సాదాసీదా క్లైమాక్స్ తో సినిమా ఎండ్ కార్డ్ పడుతుంది… ఓవరాల్ గా సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్, సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్, కొన్ని కామెడీ సీన్స్ అని చెప్పాలి, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకెండ్ ఆఫ్, క్లైమాక్స్ వీక్ గా ఉండటం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్…

అయినా కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ ని ఫస్టాఫ్ కొద్ది వరకు సాటిస్ ఫై చేస్తుంది, కానీ సెకెండ్ ఆఫ్ మాత్రం ఓపికతో చూడాల్సి వస్తుంది, సెకెండ్ ఆఫ్ ని ఫస్టాఫ్ లా మరింత ఎంటర్ టైన్ మెంట్ వే లో చెప్పి ఉంటే మంచి అటెంప్ట్ అయ్యేది ఈ పుష్పకవిమానం. మొత్తం మీద బాగా మొదలై నీరసంగా ముగిసి జస్ట్ ఓకే అనిపించుకుంది…. సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here