అదేంటో పెద్ద సినిమాల కన్నా కూడా కొన్ని క్రేజ్ ఉన్న చిన్న సినిమాలకు డైరెక్ట్ రిలీజ్ కోసం సినిమా బడ్జెట్ కన్నా కూడా డబుల్ రేట్లు ఇవ్వడానికి కొన్ని OTT వాళ్ళు సిద్ధంగా ఉంటూ వస్తున్నారు, పెద్ద సినిమాల బడ్జెట్ లు ఆల్ రెడీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంతకు మించి డైరెక్ట్ రిలీజ్ కోసం ఆఫర్ చేస్తారు కానీ మరీ డబుల్ రేంజ్ లో అంటే ఆ సినిమాలతో వాళ్ళకి కష్టం అనే చెప్పాలి.
అదే చిన్న సినిమాల విషయం లో కొంచం క్రేజ్ ఉన్నా చాలు కొద్దిగా ప్రమోట్ చేస్తే సినిమా కి టాక్ ఎలా ఉన్నా బడ్జెట్ వరకు రికవరీ ఈజీగా అవుతుంది అలాగే టాక్ బాగుంటే పెట్టిన రేటు కన్నా ఎక్కువ లాభాలను సొంతం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా ఈ ఆశతోనే…
తెలుగు లో చాలా క్రేజీ చిన్న సినిమాలకు రేట్లు సాలిడ్ గా వస్తూ ఉండగా ఇప్పుడు యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర సినిమా టీసర్ ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేయడం తో డైరెక్ట్ రిలీజ్ కి…
డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ స్టేజ్ కి వస్తుంది అంటూ ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. సినిమా బడ్జెట్ మొత్తం మీద 3 కోట్లకి అటూ ఇటూగానే పెట్టగా డైరెక్ట్ రిలీజ్ కోసం రీసెంట్ గా సినిమా కి 5.2 కోట్ల రేటు రాగా ఇప్పుడు ఆ రేటు పెంచి 6 కోట్ల రేటు కి సినిమాను కొనడానికి సిద్ధం అంటూ ముందుకు వస్తాయట OTT వాళ్ళు. అంటే ఈ రేటు సినిమా….
బడ్జెట్ కన్నా కూడా డబుల్ రేటు అని చెప్పొచ్చు… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి ఇంత బిజినెస్ జరగడం కూడా కొద్దిగా కష్టమే కానీ హిట్ టాక్ వస్తే ఎక్కువ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వాటికి అనుకూలంగా లేవు కాబట్టి ఈ రేటు కి సినిమా OTT డీల్ కన్ఫాం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు…