Home గాసిప్స్ హిట్టు కొట్టి 13 ఏళ్ళు…గోపీచంద్ మూవీ కి రాజ శేఖర్ సాలిడ్ రెమ్యునరేషన్!

హిట్టు కొట్టి 13 ఏళ్ళు…గోపీచంద్ మూవీ కి రాజ శేఖర్ సాలిడ్ రెమ్యునరేషన్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా హిట్టు కొట్టి సీనియర్ హీరో రాజ శేఖర్ కి ఏళ్ళు అవుతుంది అని చెప్పాలి. కెరీర్ లో ఎన్నో హిట్ మూవీస్ తో ఒక స్టేజ్ లో అదరగొట్టిన రాజ శేఖర్ తర్వాత టైం లో హిట్స్ కి దూరం అయ్యారు. బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 13 ఏళ్ళు అవుతుందని చెప్పాలి. 2008 టైం లో గోరింటాకు సినిమా తో ఆడియన్స్ ను…

మెప్పించిన రాజ శేఖర్ తర్వాత టైం లో హిట్స్ కి కంప్లీట్ గా దూరం అవ్వగా రీసెంట్ టైం లో గరుడ వేగ అండ్ కల్కి లాంటి కొన్ని మంచి మూవీస్ చేసినా బిజినెస్ ను అందుకోలేదు, అయినా కానీ ఇప్పుడు రాజ శేఖర్ ఓ మంచి కంబ్యాక్ ని ఇవ్వడానికి…

సిద్ధం అవుతున్నారు. యాక్షన్ హీరో గోపీచంద్ మరియు శ్రీవాస్ ల కాంబినేషన్ లో లక్ష్యం మరియు లౌక్యం లాంటి రెండు సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత హాట్రిక్ మూవీ గా కొత్త సినిమా ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే…

జరగబోతుండగా సినిమాలో హీరో అన్న రోల్ కోసం కొందరు స్టార్స్ ని అనుకోగా లాస్ట్ కి రాజ శేఖర్ ని ఫైనల్ చేశారు. చాలా టైం గా ఓ మంచి కంబ్యాక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న రాజ శేఖర్ ఈ సినిమా రోల్ కి ఒప్పుకోగా సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా సాలిడ్ గా తీసుకుంటున్నారని లేటెస్ట్ గా టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

ప్రజెంట్ రాజ శేఖర్ మార్కెట్ కి మించి 1.5 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఒక స్పెషల్ రోల్ కోసం అంటే మామూలు విషయం కాదు, కానీ ఈ సినిమా తో కచ్చితంగా ఇటు గోపీచంద్ శ్రీవాస్ ల కాంబినేషన్ హాట్రిక్ కొట్టడం రాజ శేఖర్ కంబ్యాక్ అద్బుతంగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here