Home న్యూస్ గెటప్ శీను టైం బాగుంది…ఇక కావాల్సింది ఇదొక్కటే!

గెటప్ శీను టైం బాగుంది…ఇక కావాల్సింది ఇదొక్కటే!

0

జబర్దస్త్ టీవీ షో తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుని సినిమాలలో కీలక రోల్స్ తో మంచి క్రేజ్ ను దక్కించుకుని ఇప్పుడు హీరోగా తొలి ప్రయత్నం చేస్తున్న గెటప్ శీను(Getup Srinu) ఆడియన్స్ ముందుకు రాజు యాదవ్(Raju Yadav Trailer)  అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు…

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అవ్వగా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఈ నెల 17 న రిలీజ్ కాబోతుంది. కాగా అదే డేట్ కి ముందుగా బాక్ టు బాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari) మూవీ రిలీజ్ కన్ఫాం చేసుకున్నా….

చివరి నిమిషంలో ఇప్పుడు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుని ఆడియన్స్ ముందుకు ఈ నెల 31న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఆ సినిమా తో ముందు పోటి ఉంటుంది అనుకున్న రాజు యాదవ్ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వీకెండ్ లో సోలో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది….

మే 17 వీకెండ్ ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి వదిలి వేసిన ఇతర సినిమాలు అవే డేట్స్ కి రానుండగా ఇప్పుడు సడెన్ గా రాజు యాదవ్ కి సోలో రిలీజ్ సొంతం అవుతూ ఉండటంతో కొంచం పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ అడ్వాంటేజ్ ను గెటప్ శీను ఎంతవరకు వాడుకుని హీరోగా హిట్ కొడతాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here