Home న్యూస్ రాజు యాదవ్ మూవీ టాక్ ఏంటి…సినిమా హిట్టా-ఫట్టా!!

రాజు యాదవ్ మూవీ టాక్ ఏంటి…సినిమా హిట్టా-ఫట్టా!!

0

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన గెటప్ శీను(Getup Srinu) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ రాజు యాదవ్(Raju Yadav Trailer) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది…సినిమా ట్రైలర్ కొంచం ఆకట్టుకునేలా అనిపించగా సినిమా వరుసగా పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చింది…

ఎంతవరకు సినిమా అంచనాలను అందుకుందా లేదా అంటే…పెద్దగా లేదనే చెప్పాలి ఇప్పుడు…కథ పాయింట్ విషయానికి వస్తే అల్లరి చిల్లరగా తిరగే హీరో అనుకోకుండా క్రికెట్ ఆడుతూ ముఖానికి దెబ్బ తగిలింది, ఆ దెబ్బ వలన తన లైఫ్ టర్న్ అవుతుంది…ఆ తర్వాత ఏమయింది అన్నది మిగిలిన కథ…

కథ పాయింట్ ఏమాత్రం ఆకట్టుకోగా చాలా సాదా సీదా కథ పాయింట్ తో వచ్చిన సినిమా రొటీన్ స్క్రీన్ ప్లే మరియు వీక్ నరేషన్ వలన ఏ దశలో కూడా ఆకట్టుకోలేక పోయింది. సినిమా కోసం గెటప్ శీను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు…. నవ్వుతూ సీరియస్ సీన్స్ లో నటించడం మామూలు విషయం కాదు….

హీరోయిన్ రోల్ కూడా పెద్దగా ఇంపాక్ట్ లేదు, సాంగ్స్ జస్ట్ ఓకే అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది….ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జస్ట్ యావరేజ్ గా ఉండగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ఓకే అనిపించేలా ఉన్నా కూడా చెప్పే విధానం పరంగా చాలా నెమ్మదిగా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అయ్యేలా చెప్పలేక పోయాడు…

గెటప్ శీను కదా కొంచం కామెడీ లాంటివి ఉంటాయి అని థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కొంచం ఓపిక పట్టి చూస్తె కొన్ని చోట్ల కామెడీ, కొన్ని చోట్ల గెటప్ శీను పెర్ఫార్మెన్స్ బాగున్నా కూడా ఓవరాల్ గా మూవీ చూడాలి అంటే చాలా ఓపిక అవసరం, అలా ఓపిక పట్టి చూస్తె మొత్తం మీద యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు మూవీ… సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here