Home గాసిప్స్ చిన్న సినిమా అనుకున్నారు…రాజు యాదవ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా!

చిన్న సినిమా అనుకున్నారు…రాజు యాదవ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా!

0

జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీనిని సొంతం చేసుకున్న వాళ్ళలో ఒకరైన గెటప్ శీను(Getup Srinu) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ రాజు యాదవ్(Raju Yadav) సినిమా ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా ఎలక్షన్స్ అండ్ IPL ఎఫెక్ట్ ను తట్టుకుని…

ఎంతో కొంత డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది కానీ మరీ అంచనాలను అయితే అందుకోలేదు…ఇక సినిమాను ముందు 1.5 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించాలి అనుకున్నా కూడా ఓవరాల్ గా పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 4 కోట్ల రేంజ్ దాకా బడ్జెట్ అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కోటి షేర్ మార్క్ ని దాటేసి లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా..

చిన్న సినిమా అనుకున్నా బడ్జెట్ కొంచం ఎక్కువే అయినా కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుకే సొంతం అయ్యిందని సమాచారం, తెలుగు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అండ్ డబ్బింగ్ రైట్స్ తో కలిపి ఓవరాల్ గా సినిమా కి 4.20 కోట్ల దాకా రేటుని సొంతం చేసుకుందని అంటున్నారు. అంటే ఆల్ మోస్ట్ మేకర్స్ సినిమా కి పెట్టిన బడ్జెట్ మొత్తం ….

నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రికవరీ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్ రిలీజ్ వలన ఓవరాల్ గా మేకర్స్ కి పర్వాలేదు అనిపించేలా ప్రాఫిట్ సొంతం అయ్యింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం వాల్యూ టార్గెట్ కి కొంచం దూరంలోనే ఆగిపోయిన సినిమా మేకర్స్ కి మంచి టేబుల్ ప్రాఫిట్ తెచ్చినా బాక్స్ ఆఫీస్ వైజ్ హిట్ రేంజ్ కి కష్టపడాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here