Home గాసిప్స్ షాకింగ్ న్యూస్…రెండు గెస్ట్ రోల్స్ ఏంటి సామి!

షాకింగ్ న్యూస్…రెండు గెస్ట్ రోల్స్ ఏంటి సామి!

0

చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో ఒక ఇండస్ట్రీ హిట్ అండ్ ఒక నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వినయ విధేయ రామ తర్వాత ఫుల్ టైం ని ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించాడు. ఇప్పటికే ఏడాదిన్నర అవ్వగా మరో ఏడాది వరకు ఆ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేలా లేదు.

మరో పక్క ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కూడా భారీ సినిమాలు చేస్తాడు అని అంతా అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ ఇప్పుడు రెండు గెస్ట్ రోల్స్ రామ్ చరణ్ చేయబోతున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అందులో ఒక రోల్ మట్టుకు…

కన్ఫాం అని అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు మరో సినిమా లో కూడా చిన్న గెస్ట్ రోల్ లో రామ్ చరణ్ నటించ బోతున్నారు అని స్ట్రాంగ్ బజ్ ఉంది. ఆ సినిమా మరేదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న అప్ కమింగ్ మూవీ.

ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్ లో రూపొందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా లో ఒక వారియర్ రోల్ ఒకటి ఉందని టాక్ ఉంది. ఆ రోల్ కి ఎవరో ఒకరు తెలిసిన వ్యక్తీ చేస్తే బాగుంటుంది అని టీం భావించగా రామ్ చరణ్ పేరును టీం సజస్ట్ చేశారట.

ఇదే విషయం పవన్ కళ్యాణ్ కి కూడా చెప్పడం తో రామ్ చరణ్ తో చెబుతానని చెప్పాడని అంటున్నారు. మరి రామ్ చరణ్ ఓకే అంటే మాత్రం చిరు152 లో గెస్ట్ రోల్ తో పాటు పవన్ కళ్యాణ్ 27 వ సినిమా లో కూడా గెస్ట్ రోల్ చేయడం ఖాయమని అంటున్నారు. మరి ఈ వార్తా ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here