Home TRP రేటింగ్ 4 ఏళ్ల క్రితం సినిమా…అమ్మింది 60 లక్షలు…TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

4 ఏళ్ల క్రితం సినిమా…అమ్మింది 60 లక్షలు…TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

0

కీర్తి సురేష్ ధనుష్ ల కాంబినేషన్ లో వచ్చిన రైల్ సినిమా ఎంతమందికి గుర్తు ఉంది… అసలు అలాంటి సినిమా ఒకటి వచ్చింది అని కూడా చాలా తక్కువ మందికే తెలుసు. కీర్తి సురేష్ కెరీర్ మొదట్లో చేసిన సినిమాల్లో ఒకటి ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ టైం ధనుష్ గురించి తెలుగు లో తెలిసినా కానీ మార్కెట్ మాత్రం అస్సలు లేని రోజులు అవి. అయినా కానీ ఈ సినిమా ను…

ఈ సినిమా ను 2016 సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ చేయగా పట్టుమని వీకెండ్ కూడా ఆడలేదు ఈ సినిమా. దాదాపు నాలుగేళ్ల తర్వాత యూట్యూబ్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ ని అప్లోడ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది అని చెప్పాలి.

రెస్పాన్స్ బాగుండటం తో వెంటనే స్టార్ మా ఈ సినిమా ను కేవలం 60 లక్షల రేంజ్ లో అమౌంట్ పే చేసి తెలుగు వర్షన్ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుందని ఇండస్ట్రీ లో టాక్ ఉండగా, వెంటనే సినిమా ను టెలివిజన్ లో టెలికాస్ట్ కూడా చేసేశారు చానెల్ వాళ్ళు.

ఇక సినిమా ను అమ్మిన రేట్ ప్రకారం చూసుకుంటే ఎంత TRP రేటింగ్ వచ్చినా గొప్పే అనుకున్న టైం లో ఈ సినిమా ను రీసెంట్ గా టెలికాస్ట్ చేసినప్పుడు వచ్చిన TRP రేటింగ్ సాలిడ్ షాక్ ఇచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ కన్నా కూడా ఎక్కువ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది ఈ సినిమా.

ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి 4.71 TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి. ఈ రేటింగ్ ఈ సినిమా రేటు కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ అయిన సూర్య NGK, కార్తి ఖైదీ ల కన్నా ఎక్కువగా రావడం విశేషం అనే చెప్పాలి. దాంతో సినిమాని కొన్న రేటు కి చానెల్ కి సాలిడ్ ప్రాఫిట్ దక్కి ఉండొచ్చని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here