Home న్యూస్ మహేష్ రికార్డ్ ను రామ్ చరణ్, రామ్ చరణ్ రికార్డ్ ను అల్లు అర్జున్ బ్రేక్...

మహేష్ రికార్డ్ ను రామ్ చరణ్, రామ్ చరణ్ రికార్డ్ ను అల్లు అర్జున్ బ్రేక్ చేశారు!!

42
0

     టాలీవుడ్ లో రీసెంట్ టైం లో హీరోల పుట్టిన రోజు ట్రెండ్స్ తో పాటు హీరోలు నటించిన సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ కూడా ఇయర్ ఇయర్ కి పెరిగి పోతున్నాయి. హీరోలు నటించిన క్రేజీ సినిమాల గురించి భారీ ఎత్తున ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్ టైం లో మహేష్ బాబు అభిమానులు దూకుడు వచ్చి 8 ఏళ్ళు అయిన సందర్భంగా భారీ ఎత్తున సోషల్ మీడియా లో ట్రెండ్ చేసి రికార్డ్ కొట్టారు.

ఆ రికార్డ్ ను రీసెంట్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరెంజ్ సినిమా వచ్చి 9 ఏళ్ళు అయిన సందర్భంగా భారీ ఎత్తున ట్విట్టర్ లో ట్రెండ్ చేసి ఓ రేంజ్ లో దుమ్ము లేపే రికార్డ్ కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయగా ఒక్క రోజు కూడా పూర్తీ కాక ముందే ఆ రికార్డ్ బ్రేక్ అయింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేసి 24 గంటల్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో సరికొత్త రికార్డ్ ను బెంచ్ మార్క్ ని సెట్ చేసి సంచలనం సృష్టించారు. కాగా ఇప్పటి వరకు జరిగిన ట్రెండ్స్ లో…

ఆల్ టైం టాప్ 7 యానివర్సరీ ట్రెండ్స్ ఏవో ఒకసారి గమనిస్తే…..
1)#DecadeForMemorableAarya2: 1.21M*
2)#9YrsOfCultClassicORANGE: 831K
3)#8YrsForIHDookuduSensation: 676K
4)#1YearForVeeraRaghavaRage: 530K
5)#12YearsOfBBYamadonga: 353K
6)#4YearsForCultTEMPER: 325K
7)#7YearsForIHDookudu: 243K
ఇవీ రీసెంట్ టైం లో 24 గంటల్లో హైయెస్ట్ ట్వీట్స్ తో భారీ రికార్డ్ కొట్టిన యానివర్సరీ ట్రెండ్స్…

ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సరికొత్త బెంచ్ మార్క్ ని భారీ తేడా తో సెట్ చేశారు. మరి రానున్న టైం లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే యానివర్సరీ ట్రెండ్ ఏది అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది, ఈ ట్రెండ్స్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కానీ ఫ్యాన్స్ కి తమ హీరో సినిమా పై ప్రేమ చూపడానికి ఇది కూడా ఒక మాధ్యమం లాంటిది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here