Home న్యూస్ ఇవేమీ ట్రెండ్స్ సామి…రచ్చ రచ్చ చేశారు!!

ఇవేమీ ట్రెండ్స్ సామి…రచ్చ రచ్చ చేశారు!!

1303
0

     NOV 23… టాలీవుడ్ ఫ్యాన్స్ కి బాగా గుర్తుండే రోజు అవుతుంది రీసెంట్ టైం లో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ లో రోజు ఫ్యాన్స్ ఎదో ఒకటి ట్రెండ్ చేస్తూనే ఉంటారు కానీ 23 న మాత్రం డిఫెరెంట్ గా చాలా మంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోల గురించి ట్రెండ్ చేస్తూ రోజు మొత్తాన్ని గడిపేశారు. ఒక్కో హీరోల ఫ్యాన్స్ ఒక్కో రకమైన ట్రెండ్ గా చెప్పుకోవాలి. ముందుగా…

సరిలేరు నీకెవ్వరు టీసర్ సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ ని కంటిన్యు చేయగా ఆల్ మోస్ట్ 2 లక్షల రేంజ్ ట్వీట్స్ అన్ని హాష్ టాగ్స్ కలిపి ట్రెండ్ చేశారు. ఇక తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్.ఆర్.ఆర్ సినిమా మరో 250 రోజుల్లో రానుందని…

#250DaysToMassiveRRR అంటూ ట్రెండ్ చేయగా ఆల్ మోస్ట్ 1 లక్షా 10 వేలకి పైగా ట్వీట్స్ పోల్ అయ్యాయి. వీళ్ళతో పాటు రామ్ చరణ్ అభిమానులు కూడా మరో 10 వేల రేంజ్ కి తక్కువ కానీ ట్వీట్స్ తో సపరేట్ ట్రెండ్ చేశారు. ఇక వీళ్ళ తర్వాత అల్లు అర్జున్ అభిమానులు అల వైకుంఠ పురంలో మరో 50 రోజులో రాబోతుందని ట్రెండ్ చేయగా…

వాటి పై 70 వేల ట్వీట్స్, తర్వాత సామజ వరగమనా లిరికల్ వీడియో కి 1 మిలియన్ లైక్స్ వచ్చాయని #1MLoveForSamajavaragamana  హాష్ టాగ్ ని ట్రెండ్ చేశారు, దాని పై కూడా 60 వేలకి పైగా ట్వీట్స్ పోల్ అయ్యాయి. ఇక అక్కినేని ఫ్యాన్స్ అందులో నాగ చైతన్య ఫ్యాన్స్ నాగ చైతన్య పుట్టిన రోజుని ట్రెండ్ చేస్తూ 2 లక్షలకు పైగా ట్వీట్స్ వేశారు.

వీళ్ళందరూ హీరోల గురించి ట్రెండ్ చేయగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమా అప్ డేట్ కోసం #WeWantPrabhas20Update అంటూ 2 లక్షలకు పైగా ట్వీట్స్ పోల్ చేశారు. అయినా ఉపయోగమ్ లేదు. ఇలా దాదాపు మేజర్ హీరోల ఫ్యాన్స్ అందరు కూడా సోషల్ మీడియా లో 23 వ తేదీన ట్రెండ్ చేసి రోజును ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here