Home న్యూస్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ ప్రామిస్….బిగ్గెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా!!

ఎన్టీఆర్ కి రామ్ చరణ్ ప్రామిస్….బిగ్గెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా!!

0

టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ ఒకటి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ని టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదే రావాల్సిన ఈ సినిమా వచ్చే ఇయర్ కి…

పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే, కానీ ఈ ఇయర్ లో ఇద్దరూ హీరోల బర్త్ కి స్పెషల్ ఇంట్రో టీసర్ లు ప్లాన్ చేసిన టీం కి కరోనా వలన లాక్ డౌన్ భారీ ఎదురు దెబ్బ కొట్టింది, రామ్ చరణ్ పుట్టిన రోజు ముందు మొదలైన ఈ లాక్ డౌన్…

ఎన్టీఆర్ బర్త్ డే వరకు కూడా కొనసాగుతుండగా… రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ టీసర్ ని ఆల్ రెడీ షూట్ చేయడం తో తన బర్త్ డే కి భారీ ఎత్తున రూపొందించి కొమురం భీమ్ ఎన్టీఆర్ తో స్పెషల్ గిఫ్ట్ గా ఇప్పించారు టీం. కానీ ఎన్టీఆర్ బర్త్ డే కి వచ్చే సరికి లాక్ డౌన్…

కొనసాగుతుండటం తో ఎలాంటి స్పెషల్ టీసర్ కానీ లుక్ కానీ రిలీజ్ కాలేదు, దాంతో ఫ్యాన్స్ తీవ్ర అసహాసం వ్యక్తం చేయగా సీతారామరాజు అయిన రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ ని చెబుతూ… స్పెషల్ గిఫ్ట్ ఇవ్వలేక పోయామని ఒక వర్కింగ్ స్టిల్ ని రిలీజ్ చేసి… కచ్చితంగా బిగ్గెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ని…

అన్ని సద్దుకున్నాక భారీ ఎత్తున ఇస్తామని ప్రామిస్ చేశాడు, దాంతో ఫ్యాన్స్ కోపాన్ని తగ్గించుకుని వీళ్ళ ఫ్రెండ్ షిప్ కి ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కలయికలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్స్ లో ఒకటిగా వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here