Home న్యూస్ ఎదురులేని జోరుతో దూసుకు పోతున్న ఉస్తాద్ రామ్!

ఎదురులేని జోరుతో దూసుకు పోతున్న ఉస్తాద్ రామ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni)….ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న తర్వాత నుండి రామ్ మార్కెట్ సూపర్బ్ గా పెరిగి పోయింది అని చెప్పాలి…

ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్ మూవీ సంక్రాంతికి కోవిడ్ టైంలో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన ది వారియర్ మూవీ నెగటివ్ టాక్ తో 21.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపింది.

కానీ టార్గెట్ కి చాలా దూరంలోనే ఆగిపోయినా కూడా మీడియం రేంజ్ మూవీస్ కి మిక్సుడ్ టాక్ వస్తే కలెక్షన్స్ లాంగ్ రన్ ని ఏమాత్రం హోల్డ్ ఉండవు…కానీ అదే టైంలో రామ్ మూవీస్ మిక్సుడ్ టాక్ తో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ని చూపిస్తూ ఉండగా…

ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన స్కంద(Skanda Movie) కూడా మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ఏకంగా మీడియం రేంజ్ మూవీస్ కి మిక్సుడ్ టాక్ తెచ్చుకుంటే బిగ్గెస్ట్ టార్గెట్ ను 32 కోట్లకు పైగా షేర్ తో సాలిడ్ టార్గెట్ ను సెట్ చేసింది…

మీడియం రేంజ్ మూవీ మిక్సుడ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్ళని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా సినిమా కి స్ట్రాంగ్ మార్కెట్ ను బిల్డ్ చేసుకుంటున్న రామ్ ఓ మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాను సొంతం చేసుకుంటే కచ్చితంగా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here