Home Uncategorized రామ్ రెడ్ ట్రైలర్ రివ్యూ…సస్పెన్స్ తో థ్రిల్ చేశారు…కుమ్మింది ట్రైలర్!!

రామ్ రెడ్ ట్రైలర్ రివ్యూ…సస్పెన్స్ తో థ్రిల్ చేశారు…కుమ్మింది ట్రైలర్!!

0

ఎప్పుడో సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సిన రామ్ నటించిన రెడ్ మూవీ డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చినా కానీ వాటి అన్నింటికీ కూడా నో చెబుతూ వచ్చిన రామ్ సినిమా ను ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. దాంతో ఆఫర్స్ పెరిగినా కానీ అలానే హోల్డ్ చేస్తూ వచ్చిన రామ్ సినిమా పై ఉన్న కాన్ఫిడెంట్స్ తో సినిమా ను ఇప్పుడు రిలీజ్ చేయడానికి…

సన్నాహాలు మొదలు పెట్టగా సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత రామ్ కి సినిమా పై ఉన్న కాన్ఫిడెంట్ ఏంటి అనేది క్లియర్ అవుతుంది అని చెప్పొచ్చు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన…

తడం సినిమా రీమేక్ అయినా కానీ ట్రైలర్ కట్ లో సస్పెన్స్ అండ్ థ్రిల్ చేసే ఎలిమెంట్స్ అడుగడుగునా ఉండటం తో ట్రైలర్ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసింది, ఒరిజినల్ చూసిన వాళ్ళు మాత్రమే కథ పాయింట్ ని అంచనా వేయగలరు కానీ చూడని వాళ్ళు అందరూ కూడా ట్రైలర్ చూసి….

కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు…సినిమా రేసీ స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతుంది… ట్రైలర్ లో కూడా అలా రేసీ గా రూపొందించిన స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ చేసినా కానీ సస్పెన్స్ తో థ్రిల్ కూడా చేసింది అని చెప్పాలి. రామ్ డ్యుయల్ రోల్ లో రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తున్న ఈ సినిమా తెలుగు లో పెద్దగా మార్పులు ఏవి చేయలేదని ట్రైలర్ లో స్పష్టం అవుతుంది…

హీరోయిన్స్ అందరినీ పరిచయం చేశారు, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరి పోయే విధంగా, మొత్తం మీద ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచింది అని చెప్పాలి, ఇక సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతున్న నేపధ్యంలో మళ్ళీ రామ్ కి ఇస్మార్ట్ శంకర్ రేంజ్ హిట్ దక్కుతుందో లేదో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here