బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చే నెలలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి. సినిమా అఫీషియల్ టీసర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఫస్ట్ సాంగ్ కి ఏకంగా 110 మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం అయ్యాయి… ఇక సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా….
సినిమా బిజినెస్ కూడా జోరు అందుకుంది. ఇక సినిమా వైజాగ్ ఏరియా రైట్స్ ని హీరో రామ్ పోతినేనినే స్వయంగా సొంతం చేసుకుని ఇప్పుడు ఆ ఏరియాలో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద వైజాగ్ ఏరియాకి గాను రామ్ వారియర్ మూవీ….
4.3 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకుందని అంటున్నారు, ఈ రేటు చెల్లించి స్వయంగా రామ్ ఈ సినిమా హక్కులు తీసుకుని భారీ లెవల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మాస్ కంటెంట్ తో వస్తున్న ది వారియర్ మూవీ లాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక…