Home న్యూస్ ఆ డిసాస్టర్ ఎఫెక్ట్ ఏమి లేదు…రామారావ్ కి ఈ ఏరియాలో సాలిడ్ రేటు!!

ఆ డిసాస్టర్ ఎఫెక్ట్ ఏమి లేదు…రామారావ్ కి ఈ ఏరియాలో సాలిడ్ రేటు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి ఈ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సినిమా టార్గెట్ ని అందుకోలేక సినిమా భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా డిసాస్టర్ ఎఫెక్ట్ రవితేజ అప్ కమింగ్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా ఈ నెల ఎండింగ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా…

ఖిలాడీ సినిమా డిసాస్టర్ ఎఫెక్ట్ ఈ సినిమా పై పడుతుంది అనుకున్నా కానీ సినిమా బిజినెస్ పరంగా సాలిడ్ గా జోరు చూపిస్తూ ఉండటం విశేషం. రీసెంట్ గా సినిమా ఆంధ్ర ఏరియా లో బిజినెస్ ను కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద ఆంధ్ర రీజన్ లో ఈ సినిమా…

8 కోట్ల దాకా బిజినెస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఖిలాడీ డిసాస్టర్ ఎఫెక్ట్ పెద్దగా ఈ సినిమా పై పడలేదు అనే చెప్పాలి. ఇక త్వరలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ కానుండగా ఆ ట్రైలర్ తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here