Home గాసిప్స్ 30 నిమిషాల ట్రిమ్….60 కోట్లు….కారణం ఇదే!…కానీ!!

30 నిమిషాల ట్రిమ్….60 కోట్లు….కారణం ఇదే!…కానీ!!

0

కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి రొటీన్ గా కాకుండా డిఫెరెంట్ గా సినిమాలను ఎంచుకుంటూ పోతున్న రానా దగ్గుబాటి నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత కొంత గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు అరణ్య సినిమాతో రీసెంట్ గా వచ్చాడు, సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ మాత్రం పెద్దగా సినిమా ను థియేటర్స్ లో చూడటానికి వెళ్ళడం లేదు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

భారీ నష్టాలనే ఇప్పుడు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. ఇక సినిమా కి మొత్తం మీద ఏకంగా 60 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ ని పెట్టి నిర్మించారట ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు. ఆ రేంజ్ బడ్జెట్ పెట్టడానికి తగ్గ భారీ విజువల్ సీన్స్ ఏమి కూడా సినిమాలో పెద్దగా కనిపించలేదు.

కానీ ఇంత బడ్జెట్ అవ్వడానికి కారణం సినిమా లెంత్ అనే అంటున్నారు ఇప్పుడు టాలీవుడ్ లో.. సినిమా మొత్తం మీద వచ్చిన రఫ్ లెంత్ 3 గంటల 10 నిమిషాల లెంత్ తో ఉందని, అంత లెంత్ అయితే చూడలేరని సినిమా రన్ టైం ని 2 గంటల 40 నిమిషాలకు తగ్గించారని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

ఇక సినిమా రన్ టైం 2 గంటల 40 నిమిషాల లెంత్ చూసి కూడా లెంత్ ఇంకా ఎక్కువ అయిందని ఓవరాల్ గా మరో 30 నిమిషాల ఎడిట్ చేసి మొత్తం మీద 2 గంటల 7 నిమిషాల లెంత్ తో సినిమాను రిలీజ్ చేశారని అంటున్నారు. కాగా 2 గంటల 40 నిమిషాల లెంత్ ని హిందీ వర్షన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద ఈ కారణం వలెనే… సినిమా బడ్జెట్ పరిమితులు దాటిపోయి ఏకంగా 60 కోట్ల రేంజ్ కి చేరిందని అంటున్నారు.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చాలా కాలంగానే ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వచ్చింది, దాంతో ఇదే బడ్జెట్ పెరగడానికి కారణం అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. మొత్తం మీద బడ్జెట్ లో 45 కోట్లు రికవరీ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో ఎంతవరకు రికవరీ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here