Home గాసిప్స్ 6 నెలలు ఆగి ఇప్పుడు OTT వైపు…బడ్జెట్ అండ్ బిజినెస్ ఆఫర్ ఎంతంటే!

6 నెలలు ఆగి ఇప్పుడు OTT వైపు…బడ్జెట్ అండ్ బిజినెస్ ఆఫర్ ఎంతంటే!

0

సమ్మర్ రేసులో నిలిచిన అనేక సినిమాలు ఇప్పుడు తిరిగి థియేటర్స్ ఓపెన్ అవుతున్నా కానీ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నాయి, జనాలు వస్తారో రారో అన్న డౌట్ లో ఉండటం తో మళ్ళీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ లిస్టు లో ఇప్పుడు కచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అను కున్న మరో సినిమా వచ్చే అవకాశం ఎంతైనా ఉందని తెలుస్తుంది.

రానా దగ్గుబాటి నుండి వస్తున్న సినిమాల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా అరణ్య, రీసెంట్ టైం లో అడవి చుట్టూ అల్లుకున్న కథలు చాలా రేర్ గానే రాగా రానా హీరోగా పాన్ ఇండియా లెవల్ లో కొంత కాలంగా రూపొందిన ఈ సినిమాను…

సమ్మర్ కానుకగా ఏప్రిల్ మొదట్లో రిలీజ్ చేయాలని భావించారు కానీ కరోనా వలన కుదరలేదు… దాంతో తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ చేశాక సినిమాను రిలీజ్ చేద్దమాని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు, కాగా ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తూ ఉండటం తో సినిమాను డైరెక్ట్ రిలీజ్ వైపు ఆలోచిస్తున్నారట.

సినిమా కి లీడింగ్ OTT యాప్స్ నుండి 50 నుండి 55 కోట్ల రేంజ్ లో ఆఫర్లు అన్ని వర్షన్స్ కలిపి దక్కుతున్నాయని అంటున్నారు. ఇవి మంచి ఆఫర్స్ అనే చెప్పాలి కానీ సినిమా బడ్జెట్ కొంచం ఎక్కువ అయ్యిందట. ఈ సినిమాను మొత్తం మీద 60 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీగా తెరకెక్కించారని సమాచారం…. ఆ లెక్కన చూసుకుంటే…

ఈ బిజినెస్ కొంచం తక్కువే అయినా కానీ అన్ని భాషల శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ అవ్వడమే కాకుండా లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది, మరి యూనిట్ ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రం ఆసక్తి కరంగా మారిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here