బాహుబలి తో తన రేంజ్ ని పెంచుకున్న రానా దగ్గుబాటి ఆ సినిమా ని భారీగా క్యాష్ చేసుకోవాలని మాత్రం చూడలేదు, అడపాదడపా సినిమాలు చేయకుండా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న రానా దగ్గుబాటి చేసిన సినిమాలలో అరణ్య సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్న టైం కి కరోనా ఎంటర్ అవ్వడం తో ఆ సినిమా పోస్ట్ పోన్ లు వరుసగా అవుతూ రాగా సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని మొదట్లో చెప్పడంతో ఈ సినిమా పై ఆశలను OTT యాప్స్ పెట్టుకోలేదు, కానీ తర్వాత OTT వైపు అడుగులు వేస్తె ఎలా ఉంటుంది అనుకున్నారో లేదో వరుస పెట్టి ఆఫర్స్ రావడం తో సినిమా కి క్రేజ్ తగ్గలేదు అని గుర్తించి సినిమాను…
థియేటర్స్ లోనే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. దాంతో అప్పటి నుండి సినిమా కి పెద్దగా ఆఫర్స్ రాలేదు కానీ రిలీజ్ కి ఇంకా టైం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు మరోసారి తమ వంతుగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సినిమా కి రేటు బాగా పెంచి….
కొత్త రేటు ని ఆఫర్ చేసింది అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న టాలీవుడ్ టాక్. ఇది వరకే సినిమాకి 55 కోట్ల రేంజ్ ఆఫర్ అన్ని భాషలలో కలిపి సొంతం అవ్వగా మేకర్స్ నో చెప్పారు, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా కోసం ఏకంగా 65 కోట్ల రేంజ్ ఆఫర్ ని ఇచ్చింది అనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్ అని అంటున్నారు.
ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా ఈ రేటు మాత్రం సాలిడ్ రేటు అనే చెప్పాలి. థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ ఈ రేంజ్ బిజినెస్ అన్ని చోట్లా కలిపి సొంతం చేసుకోవడం కష్టమే కానీ సంక్రాంతి కి అనౌన్స్ చేసిన సినిమా జనాలను మళ్ళీ థియేటర్స్ కి రప్పించే అవకాశం ఉన్న సినిమా కాబట్టి OTT వైపు చూడరు అని అంతా భావిస్తున్నారు.